Home గాసిప్స్ ఆ TRP లు బోయపాటికి ఊపిచ్చాయి…BB3 లో మరింత రచ్చంట!

ఆ TRP లు బోయపాటికి ఊపిచ్చాయి…BB3 లో మరింత రచ్చంట!

0

మాస్ లో మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు… మాస్ ఆడియన్స్ బోయపాటి సినిమా అంటే టాక్ ని కూడా పట్టించుకోకుండా సినిమా చూస్తారు. మినిమం గ్యారంటీ స్టఫ్ ఎప్పుడూ ఉండేలా చూసుకునే బోయపాటి మాస్ డోస్ అవసరానికి మించి పెంచి తీసిన సినిమా వినయ విదేయ రామ. ట్రైన్ చేస్ సీన్, తలలు నరికితే గద్దలు పట్టుకు వెళ్ళడం, పాము మనిషిని కాటేసి అదే చనిపోవడం…

ఇలా తన ఓవర్ క్రియేటివిటీని వినయ విదేయ రామ సినిమాలో ఎక్కువగా చూపడంతో ఘోరంగా ట్రోల్స్ కి గురి అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయినప్పటికీ బుల్లి తెరపై మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. టెలికాస్ట్ అయిన ప్రతీసారి…

సాలిడ్ TRP రేటింగ్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా టెలివిజన్ సక్సెస్ ఇప్పుడు బోయపాటి కి రెట్టించిన జోష్ ని తెప్పించిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. బాలయ్య తో ప్రస్తుతం చేస్తున్న హాట్రిక్ మూవీ లో ముందు ఇలాంటి సీన్స్ వద్దు అనుకున్నారు కానీ ఇప్పుడు టెలివిజన్ లో వినయ విదేయ రామ…

సక్సెస్ చూసి మళ్ళీ జోష్ తెచ్చుకున్న బోయపాటి బాలయ్య సినిమా లో కూడా ఇలాంటి ఓవర్ ది టాప్ సీన్స్ ని బాగానే ప్లాన్ చేస్తున్నాడు అన్నది లేటెస్ట్ టాక్. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది కానీ బాలయ్య బోయపాటి సినిమా కి ఉన్న క్రేజ్ దృశ్యా శ్రద్ధగా సినిమా ను సింహా, లెజెండ్ రేంజ్ లో తీస్తే…

కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం అనే రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. కాగా త్వరలోనే మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకో బోతున్న ఈ సినిమా ను వచ్చే ఇయర్ సంక్రాంతి రేసులో నిలపాలి అన్నది బోయపాటి ఆలోచన. మరి ఎం చేస్తాడో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here