Home న్యూస్ 1st డే బ్రహ్మాస్త్ర కలెక్షన్స్….ఇదేం కొట్టుడు సామి!!

1st డే బ్రహ్మాస్త్ర కలెక్షన్స్….ఇదేం కొట్టుడు సామి!!

0

బాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్ర వరల్డ్ వైడ్ గా 9000 వరకు స్క్రీన్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో సొంతం చేసుకుంది, హిందీ లో అల్టిమేట్ ఓపెనింగ్స్ ని అందుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా కి అక్కడ బాయికాట్ ట్రెండ్స్ అండ్ టాక్ కూడా కొంచం మిక్సుడ్ గా వినిపిస్తూ ఉండగా సౌత్ లో మాత్రం టాక్ కొంచం…

పర్వాలేదు ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించే విధంగా ఉండగా తెలుగు రాష్ట్రాలలో మట్టుకు సినిమా బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి అని చెప్పాలి ఇప్పుడు. హిందీ తర్వాత తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా కొనసాగుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి రోజు ఇప్పుడు 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై డిపెండ్ అవ్వగా అన్ని చోట్లా బాగుంటే 2.2 కోట్లు ఆ పైన సినిమా కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉంది.

ఇక హిందీ లో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా కొన్ని చోట్లా జస్ట్ ఓకే అనిపించుకున్నా కానీ ఓవరాల్ గా మాత్రం మొదటి రోజు 28 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక టోటల్ ఇండియా లో సినిమా అన్ని వర్షన్ లు కలుపుకుని ఇప్పుడు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్నీ బాగుంటే…

34 కోట్ల నుండి 36 కోట్ల రేంజ్ దాకా నెట్ కలెక్షన్స్ ని సాధించవచ్చు అంటున్నారు. మొత్తం మీద సినిమా సెన్సేషనల్ స్టార్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా పాండమిక్ తర్వాత బాలీవుడ్ మూవీస్ పరంగా ఇది సెన్సేషనల్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఇక డే 1 అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here