Home న్యూస్ జిన్నా టీసర్ టాక్…ఏకంగా పాన్ ఇండియాకి గురి పెట్టిన విష్ణు!!

జిన్నా టీసర్ టాక్…ఏకంగా పాన్ ఇండియాకి గురి పెట్టిన విష్ణు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. దశాబ్దం క్రితం దేనికైనా రెడీ దూసుకెల్తా లాంటి హిట్స్ ని అందుకున్న తర్వాత హిట్స్ కి కంప్లీట్ గా దూరం అయిపోయిన మంచు విష్ణు చేసిన సినిమా చేసినట్లు ఫ్లాఫ్ అవుతూ ఉండగా లాస్ట్ ఇయర్ భారీ బడ్జెట్ తో మోసగాళ్ళు అనే సినిమా చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చినా ఆ సినిమా అంచనాలను అందుకోలేదు…

ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రూట్ మార్చి కంప్లీట్ ఎంటర్ టైనర్ తో మరోసారి తన లక్ ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నాడు మంచు విష్ణు… ఇక్కడ విశేషం ఏంటి అంటే నార్మల్ కమర్షియల్ మూవీ ని ఈ సారి ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో….

రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతూ ఉండటం అని చెప్పాలి. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా నే జిన్నా పేరుతో రానుండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ లో లౌడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కొంచం ఓవర్ గా అనిపించినా…

కొన్ని సీన్స్ ఎంటర్ టైన్ చేయడం, టీసర్ లో మంచు విష్ణు డైలాగ్ డిక్షన్ బాగుండటం, టీసర్ ఎండింగ్ లో రీసెంట్ టైం లో తగ్గిపోయిన హర్రర్ కామెడీ టచ్ ను మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినట్లు చూపించడం ఓవరాల్ గా రీసెంట్ మంచు విష్ణు మూవీస్ తో పోల్చితే కొంచం బెటర్ గానే ఉన్నట్లు అనిపించింది. సన్నీ లియోన్ కూడా సినిమాలో ఉండటంతో…

సినిమాను తెలుగు తో పాటు హిందీ మరియు మలయాళంలో కూడా రిలీజ్ చేస్తూ పాన్ ఇండియా టచ్ కూడా సినిమాకి కలిసి రానుంది. ఓవరాల్ గా టీసర్ పర్వాలేదు అనిపించగా అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమాతో మంచు విష్ణు బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here