బాలీవుడ్ లో రీసెంట్ టైం లో ప్రతీ సినిమా విషయంలో బాయికాట్ ట్రెండ్ అనేది కామన్ గా మారి పోయింది, ఫ్లాఫ్ అనిపించే సినిమాలను, మినిమమ్ యాక్టింగ్ స్కిల్స్ లేకున్నా ఛాన్సులు దక్కించుకునే స్టార్ కిడ్స్ మూవీస్ ని బాయికాట్ చేసినా బాగుంటుంది కానీ, ఏ సినిమా పడితే ఆ సినిమా ఎలాంటి పెద్ద రీజన్ లేకుండా బాయికాట్ చేస్తూ బాలీవుడ్ కి ఏమాత్రం ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వడం లేదు బాయికాట్ ట్రెండ్స్ చేసేవాళ్ళు…
అలానే చేసి అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా భందన్ సినిమాలు డిసాస్టర్స్ చేయగా ఇప్పుడు రణబీర్ కపూర్ ఆలియా భట్ ల కాంబోలో ఏకంగా 400 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమాను కూడా…
బాయికాట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో ప్రతీ రోజూ ట్రెండ్ చేస్తూనే ఉన్నారు, కానీ లాల్ సింగ్ చడ్డా మరియు రక్షా భందన్ సినిమాల మాదిరిగా ఈ సినిమా విషయంలో ఆడియన్స్ రియాక్షన్ ఒకేలా ఏమి లేదు… పాండమిక్ తర్వాత బాలీవుడ్ మూవీస్ పరంగా ది బెస్ట్ అనిపించే రేంజ్ లో…
అడ్వాన్స్ బుకింగ్స్ తో దూసుకు పోతుంది బ్రహ్మాస్త్ర సినిమా, తెలుగు రాష్ట్రాల్లో కూడా మేజర్ సిటీలలో అడ్వాన్స్ బుకింగ్స్ బాగుండగా హిందీ వర్షన్ ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఆల్ రెడీ సొంతం చేసుకోవడంతో ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపిస్తున్న ఈ సినిమా తొలిరోజు ఇదే ఫ్లోని చూపిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర…
30 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ ని అన్ని వర్షన్ లు కలిపి సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు ఇప్పుడు. ఒక పక్క బాయికాట్ ట్రెండ్ నడుస్తున్నా కానీ ఈ సినిమా విషయంలో జనాలలో ఉన్న ఆలోచన మరో విధంగా ఉంది, ఇక సినిమా హిట్ టాక్ ని తెచ్చుకుంటే ఈ బాయికాట్ ట్రెండ్స్ తగ్గే అవకాశం ఉందని అంటున్నారు…