రిలీజ్ అయినప్పుడు కాకుండా రిలీజ్ అయిన తర్వాత వార్తల్లో నిలిచిన సినిమా బ్రీత్(BREATHE Movie OTT Review)….నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో నందమూరి చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) నటించిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ టైంలో రిలీజ్ అయ్యి ఆడియన్స్ పెద్దగా పట్టించుకోక పోవడంతో డిసాస్టర్ అయింది…
తర్వాత హీరో చేసిన కామెంట్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఇప్పుడు OTT లో సినిమా రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ అవ్వడంతో మంచి వ్యూవర్ షిప్ నే సొంతం చేసుకుంటుంది. మరి సినిమా కాన్సెప్ట్ ఏంటి ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను గమనిస్తే… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే….
స్టేట్ ముఖ్యమంత్రి ఆరోగ్యం బాలేక పోవడంతో బ్రీత్ అనే హాస్పిటల్ కి తీసుకు వెళతారు, అదే టైంలో తనని చంపాలని కొందరు ట్రై చేస్తారు. అక్కడే ఉన్న హీరో ఎలా ముఖ్యమంత్రిని కాపాడాడు ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ పడ్డాయి కానీ సినిమా కథ పాయింట్…
బాగానే ఉంది, కొన్ని చోట్ల సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఇంప్రెస్ చేశాయి, కానీ ఓవరాల్ గా సినిమా గా చూస్తె మట్టుకు అతి సాదారణంగా అనిపించింది బ్రీత్ మూవీ… చైతన్య కృష్ణ నటన అంతగా ఇంప్రెస్ చేయలేదు, తన డబ్బింగ్ కూడా చాలా సీన్స్ కి అస్సలు సెట్ అవ్వలేదు, స్క్రీన్ ప్లే కూడా చాలా నెమ్మదిగా సాగుతూ సహనానికి పరీక్ష పెడుతుంది..
ఇరికించడానికి ట్రై చేసిన కామెడీ ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు…. మొత్తం మీద అతి కష్టం మీద పడుతూ లేస్తూ సాగిన బ్రీత్ మూవీ చూడాలి అంటే చాలా ఓపిక అవసరం, అంత ఓపిక ఉంటే మొత్తం మీద కొంచం కష్టంగా అయినా ఒక సారి ట్రై చేయోచ్చు లే అనిపించేలా ఉంటుంది ఈ సినిమా…..ఆ టైంలో ఈ సినిమా కన్నా ఇంకా బెటర్ కంటెంట్ OTT లో చాలా దొరుకుతాయి…
అవన్నీ చూసి టైం లేదు అనుకుంటే అప్పుడు బ్రీత్ మూవీ ని ఒకసారి ట్రై చేసుకోవచ్చు…. మరీ ట్రోల్ చేసినంతగా నిరాశ పరచదు కానీ నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది, ఓవరాల్ గా సినిమా యావరేజ్ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు.