Home న్యూస్ ఇండస్ట్రీ హిట్ పై కన్నేసిన మంజుమ్మేల్ బాయ్స్…ఇంకా ఎన్ని కోట్లు కావాలంటే!

ఇండస్ట్రీ హిట్ పై కన్నేసిన మంజుమ్మేల్ బాయ్స్…ఇంకా ఎన్ని కోట్లు కావాలంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ ఇండస్ట్రీ ఫిబ్రవరి నెలలో వరుస పెట్టి బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకు పోతూ ఉండగా ఫిబ్రవరిలో వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతున్న సినిమా మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys Movie) కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా…

సినిమా 2 వారాల్లో వరల్డ్ వైడ్ గా అక్షరాలా 124 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని దుమ్ము దుమారం లేపింది… సినిమా 15 రోజుల్లో ఇప్పుడు ఆల్ మోస్ట్ 130 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది. కాగా మలయాళ ఇండస్ట్రీ పరంగా ఇప్పుడు ఈ సినిమా…

కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇది వరకు మలయాళ మూవీస్ పరంగా 2023 ఇయర్ లో వచ్చిన 2018 మూవీ టోటల్ రన్ లో 178 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో మలయాళంలో ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు మంజుమ్మేల్ బాయ్స్ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…

దూసుకు పోతూ ఉండగా సినిమా తమిళనాడులో సెన్సేషనల్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ఇప్పటికే 130 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవడం, వీకెండ్ లో వసూళ్ళతో మరింత ఊచకోత కోసే అవకాశం ఉండటంతో మరో 48 కోట్ల దూరంలో ఇండస్ట్రీ హిట్ టాక్ దూరంలో ఉంది, టోటల్ రన్ లో ఈ సినిమా ఇప్పుడు…

2018 మూవీ టోటల్ రన్ కలెక్షన్స్ ని దాటేసి మరింత జోరు చూపించి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక తెలుగు లో కూడా సినిమా మీద క్రేజ్ ఏర్పడుతూ ఉండటంతో త్వరలోనే డబ్ చేసి ఇక్కడ గ్రాండ్ గా రిలీజ్ చేసే అవకాశం ఉండటంతో ఇక్కడ కలెక్షన్స్ మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here