Home న్యూస్ NBK109 గ్లిమ్స్ రివ్యూ….మరో బ్లాక్ బస్టర్ ఖాయం!!

NBK109 గ్లిమ్స్ రివ్యూ….మరో బ్లాక్ బస్టర్ ఖాయం!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ ని కంప్లీట్ చేసుకుని టాలీవుడ్ సీనియర్ హీరోలలో సూపర్ ఫామ్ తో దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేసిన తన కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటూ ఉండగా ఇప్పుడు మహా శివరాత్రి కానుకగా…

సినిమా గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు…గ్లిమ్స్ చూస్తూ ఉంటే హాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడేలా ఉంది అనిపించే రేంజ్ లో గ్లిమ్స్ మెప్పించింది అని చెప్పాలి. నైట్ టైంలో విలన్స్ బెండు తీస్తూ బాలయ్య ఒక బాక్స్ ఓపెన్ చేస్తూ అందులో ఆయుధాలతో పాటు మాన్షన్ హౌస్ బాటిల్ ని ఓపెన్ చేసి…

విలన్స్ తో రచ్చ చేయగా బాలయ్య న్యూ లుక్ బాగా సెట్ అయ్యింది, చిన్న ఫైట్ గ్లిమ్స్ ను చూపించగా సింపుల్ గా బాగా మెప్పించింది, తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరీ ఎక్స్ లెంట్ కాదు కానీ ఉన్నంతలో బాగానే మెప్పించేలా ఉందని చెప్పాలి…. ఓవరాల్ గా గ్లిమ్స్ బాలయ్య నటించిన…

రీసెంట్ మూవీస్ కి ఏమాత్రం తీసిపోని విధంగా హిట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉండనిపించేలా మెప్పించింది అని చెప్పాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో దసరా టైంకి సినిమా రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారని టాక్ ఉంది… ఇక గ్లిమ్స్ కి 24 గంటల్లో ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here