Home న్యూస్ చాణక్య రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

చాణక్య రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

     లౌక్యం తర్వాత మళ్ళీ క్లీన్ హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ చాణక్య, బాక్స్ అఫీస్ దగ్గర నేడు భారీ ఎత్తున వచ్చేశాడు. ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పూర్తీ కాగా అక్కడ నుండి ఎబో యావరేజ్ రేంజ్ టాక్ వినిపించగా.. ఇప్పుడు రెగ్యులర్ షోల ఫైనల్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ. ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…

స్పై ఏజెంట్ అయిన హీరో ఒక మిషిన్ మీద ఇండియా మోస్ట్ వాంటెడ్ విలన్ ని పట్టుకోవడానికి ప్రిపేర్ అవుతాడు, ముందు అండర్ కవర్ లో ఉన్న హీరో నిజా నిజాలు తెలుసుకుని తర్వాత పాకిస్తాన్ లో మిషన్ మొదలు పెడతాడు. మరి ఆ మిషన్ సక్సెస్ అయ్యిందా లేదా అన్నది అసలు కథ.

ఇలాంటి రా స్పై టైప్ కథ లు రీసెంట్ టైం లో ఎక్కువగా వచ్చాయి. బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో కూడా కథ పాయింట్ ఆల్ మోస్ట్ ఇదే విధంగా ఉంటూ వస్తుంది. దాంతో చాణక్య సినిమా చూస్తున్నంత సేపు పాత సినిమాలు గుర్తుకు రావడం క్రమంగా జరుగుతూ ఉంటుంది.

ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గోపీచంద్ లుక్స్ బాగున్నాయి, యాక్షన్ సీన్స్ బాగా చేశాడు, పెర్ఫార్మెన్స్ కూడా మెప్పిస్తుంది, కానీ మరీ నటన కి పరీక్ష పెట్టె రోల్ కాక పోవడం తో మంచి ఈజ్ తో నటించాడు గోపీచంద్. ఇక హీరోయిన్ మేహ్రీన్ సాంగ్స్ కోసం సినిమా లో యాక్ట్ చేయగా…

నటించడానికి పెద్దగా స్కోప్ లేదు, బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ కొంచం బెటర్ రోల్ దక్కింది. మిగిలిన నటీనటుల్లో అలీ కొంచం కామెడీ తో ఆకట్టుకోగా మిగిలిన నటీనటులు పెద్దగా నటించే స్కోప్ లేదు. ఇక సంగీతం విషయానికి వస్తే పాటలు చాలా యావరేజ్ గా ఉన్నాయి.

బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించే విధంగా అనిపించింది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది, తర్వాత సీన్ ఎలా ఉంటుంది అన్నది ఆడియన్స్ ఈజీ గా చెప్పగలరు… దానికి తోడూ కొంచం స్లో నరేషన్ అక్కడక్కడా బోర్ కొట్టించింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా ఉన్నాయి.

రిచ్ లోకేషన్స్, విజువల్ గ్రాండియర్ పెట్టిన ప్రతీ పైసా స్క్రీన్ పై అద్బుతంగా కనిపించింది కానీ అందులో జీవం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక డైరెక్షన్ పరంగా తిరు మరీ అద్బుతం అనిపించే కథ కాకున్నా మంచి కథనే రాసుకున్నాడు కానీ అది పెర్ఫెక్ట్ గా తెరకెక్కించలేదు.

మొత్తం మీద ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ కి వస్తే
రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్
యాక్షన్ సీన్స్
ఇంటర్వెల్ సీన్
ఆలీ కామెడీ
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే
కథ రిపీటెడ్ గా అనిపించడం
సంగీతం
డైరెక్షన్
లెంత్
స్లో నరేషన్
ప్రిడిక్టబుల్ స్టొరీ లైన్
ఇవి సినిమా లో మొత్తం మీద ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్…

గోపీచంద్ తన వంతుగా సినిమా ను నిలబెట్టడానికి చాలా కృష్టి చేశాడు కానీ అది పూర్తిగా సఫలం కాలేదు. కానీ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారు ఒకసారి చూడొచ్చు. సినిమాకి ఫైనల్ గా మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here