మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోల్లో రాఘవ లారెన్స్(Raghava Lawrene) ఒకరు కాగా కాంచన సిరీస్ తో తెలుగు లో కూడా భారీ హిట్స్ ను సొంతం చేసుకున్న లారెన్స్ ఇప్పుడు చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి2(Chandramukhi2) తో ఆడియన్స్ ముందుకు….
రీసెంట్ గా వచ్చేయగా సినిమా మాస్ సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది… కానీ క్లాస్ సెంటర్స్ లో పెద్దగా బుకింగ్స్ ఏమి కనిపించలేదు. చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ లో ఆఫ్ లైన్ కౌంటర్ టికెట్ సేల్స్ సినిమాకి..
ఎక్కువగా జరగగా మొత్తం మీద ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి రోజు 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్లా ట్రాక్ చేయలేం కాబట్టి అవన్నీ బాగుంటే…
2.2 కోట్ల నుండి 2.5 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక తమిళ్ లో కూడా ఎక్కువగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జరుగుతూ ఉండగా సినిమా అక్కడ 6 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోవచ్చు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పైనే…
సినిమా ఎక్కువగా డిపెండ్ అయ్యిందని చెప్పాలి. మాస్ మూవీ అవ్వడం, లారెన్స్ మూవీస్ కి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి టోటల్ ఆఫ్ లైన్ రిపోర్ట్స్ అంచనాలను అందుకుంటే ఈ రేంజ్ లో వసూళ్లు, అంచనాలను మించిపోతే ఈ మార్క్ ని మించిపోవచ్చు. ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.