మాస్ మహారాజ రవితేజ(Raviteja) నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఛాంగురే బంగారు రాజా(Changure Bangaru Raja) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ట్రైలర్ రిలీజ్ తర్వాత కొంచం ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
స్టోరీ పాయింట్ విషయానికి వస్తే ఊర్లో మెకానిక్ గా పని చేసే హీరో తన తండ్రి కోల్పోయిన పొలాన్ని తిరిగి పొందాలని ట్రై చేస్తూ ఉండగా తను ఊర్లో అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉండగా ఒక వ్యక్తి హత్య జరుగుతుంది… ఆ హత్య కేసులో హీరో ఇరుక్కోవాల్సి వస్తుంది….
మరి ఆ హత్య చేసింది ఎవరు, హీరో తర్వాత ఎం చేశాడు అన్నది సినిమా కథ పాయింట్…. రంగురాళ్ళ చుట్టూ… క్రైం కామెడీ మూవీ గా వచ్చిన ఛాంగురే బంగారు రాజా సినిమా ఓవరాల్ పాయింట్ బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే స్లో గా ఉండటం అలాగే అక్కడక్కడా కథ బాగా డ్రాగ్ అవ్వడం లాంటివి….
మైనస్ పాయింట్స్ గా మారింది. కానీ కొన్ని సీన్స్ బాగా ఉండటం, ఎంటర్ టైన్ మెంట్ కొన్ని సీన్స్ లో బాగానే వర్కౌట్ అవ్వడంతో ఓవరాల్ గా మూవీ పరంగా చూసుకుంటే కొన్ని ప్లస్ అండ్ మైనస్ తో వచ్చిన ఛాంగురే బంగారు రాజా కొంచం ఓపిక పట్టి చూస్తె…
డీసెంట్ టైం పాస్ మూవీగా ఉందని చెప్పాలి. అందరి పెర్ఫార్మెన్స్ బాగుండగా సత్య కామెడీ కొన్ని సీన్స్ లో బాగా మెప్పించింది. ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించాయి. డైరెక్టర్ సతీష్ వర్మ డీసెంట్ పాయింట్ ను ఎంచుకుని కొన్ని సీన్స్ పరంగా బాగానే ఆకట్టుకున్నాడు… ఓవరాల్ గా 2 గంటల పాటు మాత్రం ఆడియన్స్ ను కుర్చీలలో కూర్చో పెట్టే విషయంలో…
పూర్తిగా సఫలం అవ్వలేదు కానీ ముందే చెప్పినట్లు కొంచం ఓపికతో చూస్తె ఓవరాల్ గా డీసెంట్ ఎంటర్ టైనర్ గా ఛాంగురే బంగారు రాజా ఉంటుందని చెప్పొచ్చు….వీకెండ్ లో కొత్త సినిమాలు అన్నీ చూసి ఉంటే ఈ సినిమా కూడా టైం పాస్ కోసం ట్రై చేయోచ్చు….సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్.