బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు అన్నీ కూడా హిట్ అవ్వాలని రూల్ ఏమి లేదు, కొన్ని సినిమాలు యావరేజ్ లేదా నెగటివ్ టాక్ లతోనే హిట్ అయిన సందర్బాలు అనేకం ఉన్నాయి. ఈ సంక్రాంతికే చూసుకుంటే… రెడ్ ది ఫిల్మ్ పాజిటివ్ టాక్ తెచ్చుకోకున్నా సూపర్ హిట్ గా నిలిచింది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ 2 సినిమాలు మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కానీ…
బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి, అవే నితిన్ నటించిన చెక్ మూవీ మరోటి శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమాలు. రెండు సినిమాల్లో శ్రీకారం సినిమాకి మరింత ఎక్కువ పాజిటివ్ టాక్ ఉంది కానీ కలెక్షన్స్ డిసాస్టర్ రేంజ్ లో ఉన్నాయి.
చెక్ మూవీ ఫ్లాఫ్ అవ్వడానికి రీజన్స్ సినిమాను అస్సలు ప్రమోట్ చేయలేదు…అండ్ సినిమాకి టికెట్ హైక్స్ విపరీతంగా పెంచడం, ఒక నార్మల్ కమర్షియల్ మూవీ అయ్యి ఉంటె టికెట్ సేల్స్ ఆఫ్ లైన్ లో జరిగేవి కానీ ఇలాంటి ఎక్స్ పెరిమెంటల్ మూవీ కి టికెట్ హైక్స్ ఆఫ్ లైన్ లో తీవ్ర ఇంపాక్ట్ ని చూపి సినిమా ఫ్లాఫ్ కి రీజన్ అయింది.
ఇక శ్రీకారం సినిమా విషయం లో కూడా టికెట్ హైక్స్ ప్రధాన పాత్ర పోషించాయి. కమర్షియల్ మూవీ కాదు, మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కి టికెట్ హైక్స్ పెట్టి థియేటర్స్ కి వెళ్లి మెసేజ్ తీసుకోవాల్సిన అవసరం తక్కువ మందికే ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై భారీగా ఎఫెక్ట్ చూపింది. డానికి తోడూ జాతితర్నాలు అల్టిమేట్ ట్రెండ్ కూడా..
ఎఫెక్ట్ చూపింది. కారణాలు అనేకం ఉన్నాయి కానీ పోటి ఉన్నప్పటికీ టికెట్ రేట్లు నార్మల్ గా ఉండి ఉంటె కామన్ సినీ లవర్స్… ఒకసారి చూద్దాం లే అని వెళ్ళే వాళ్ళు కానీ టికెట్ హైక్స్ వలన ఫ్యామిలీస్ అండ్ కామన్ సినీ గోర్స్ సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సినిమా క్రేజ్ ని బట్టి సోలోగానో లేదా టికెట్ హైక్స్ లేకుండానో రిలీజ్ లు ఎంచుకుంటే కొంచం బెటర్ రిజల్ట్ లు వచ్చే అవకాశం ఉంటుంది..