బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో సిద్దార్థ్(siddharth) నటించిన లేటెస్ట్ మూవీ చిన్నా(Chinna Movie) ఒకటి… ఇతర సినిమాలతో పోల్చితే పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా తమిళ్ లో ఆల్ రెడీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.
మరి సినిమా తెలుగు లో ఎంతవరకు ఆడియన్స్ అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ… స్టోరీ పాయింట్ విషయానికి వస్తే తన అన్న చనిపోవడంతో అన్న జాబ్ చేసే హీరోకి తన అన్నయ్య కూతురు అంటే చాలా ఇష్టం, అన్న కూతురు ఫ్రెండ్ తో కూడా ప్రేమగా ఉండే హీరో మీద అనుకోకుండా కొన్ని ఆరోపణలు వస్తాయి…
ఆ తర్వాత కథ ఏం అయింది అన్నది సినిమా మిగిలిన కథ… ఒక సీరియస్ అండ్ సెన్సిటివ్ టాపిక్ మీద తీసిన ఈ మెసేజ్ అండ్ థ్రిల్లర్ మూవీ అయినా చిన్నా మూవీ టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పడుతుంది… ఒక 35-40 నిమిషాల టైం టేక్ ఆఫ్ కి పట్టగా…
తర్వాత కథ సీరియస్ గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునేలా సాగుతుంది, సిద్దార్థ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు…కథనం మాత్రం కొద్దిగా నెమ్మదిగా సాగడం ఒక్కటి కొంచం మైనస్ అయినా కూడా ఓవరాల్ గా ఒక మంచి మెసేజ్ ను సొసైటీ కి ఇచ్చిన చిన్న మూవీ రెగ్యులర్ మూవీ లవర్స్ కోసం అయితే కాదు కానీ…
ఇలాంటి డిఫెరెంట్ అండ్ సీరియస్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది… అలాగే రొటీన్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ ఈ థ్రిల్లర్ మూవీ ని ఒకసారి చూడొచ్చు. టేక్ ఆఫ్ కి కొంచం పడుతుంది కానీ తర్వాత సినిమా చాలా బాగా ఆకట్టుకుంటుంది….