Home న్యూస్ రూల్స్ రంజన్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

రూల్స్ రంజన్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) సమ్మర్ లో మీటర్ తో భారీ ఫ్లాఫ్ ను తన ఖాతాలో వేసుకోగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రూల్స్ రంజన్(Rules Ranjann) సినిమా తో వచ్చేశాడు….

మరి ఈ సినిమాతో ఎంతవరకు అంచనాలను అందుకున్నాడో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే….ముంబైలో జాబ్ చేసుకునే హీరో తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుని చాలా సిన్సియర్ గా ఉంటాడు…అలాంటి హీరో లైఫ్ లోకి హీరోయిన్ వస్తుంది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

పెర్ఫార్మెన్స్ పరంగా కిరణ్ అబ్బవరం తన వరకు పర్వాలేదు అనిపించేలా నటించాడు, నేహా శెట్టి రోల్ ఓకే అనిపించగా ఒక సాంగ్ లో యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ బోర్ కొట్టేలా ఉండగా చాలా సీన్స్ ను డ్రాగ్ చేసి సహనానికి పరీక్ష పెట్టారు…

సంగీతం విషయంలో 2 సాంగ్స్ బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించింది, ఇక సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించాయి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా చాలా సింపుల్ స్టోరీ పాయింట్ కాగా ఆ కథని ఎంటర్ టైన్ మెంట్ ని జోడించాడు కానీ…

అవి చాలా తక్కువ సీన్స్ కే పరిమితం అవ్వగా ఎక్కువ శాతం సీన్స్ సహనానికి పరీక్ష పెట్టాయి… ఓవరాల్ గా కొన్ని కామెడీ సన్నివేశాలు, సమ్మోహనుడా సాంగ్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి అని చెప్పాలి. ఇక సినిమా కోర్ పాయింట్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్ అని చెప్పాలి..

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్ళే ఆడియన్స్ చాలా ఓపిక పట్టి చూస్తె సినిమాలో ఫ్లాస్ ఉన్నప్పటికీ ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు కానీ ఆడియన్స్ కి ఓపిక చాలా అవసరం, కిరణ్ అబ్బవరం నుండి వచ్చిన మీటర్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని లాంటి మూవీస్ తో పోల్చితే కొంచం బెటర్ అని చెప్పొచ్చు….

మొత్తం మీద సినిమా వెళ్ళాలి అనుకునే ఆడియన్స్ చాలా తక్కువ అంచనాలతో థియేటర్స్ కి వెళితే పడుతూ లేస్తూ సాగే రూల్స్ రంజన్ ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.25 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here