టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీస్ లైనప్ సాలిడ్ గానే ఉండగా ఇంకా కొత్త సినిమాలు ఈ లిస్టులో చేరుతూ వెళుతున్నాయి, ఈ క్రమం లో ఏ సినిమా ఎప్పుడు మొదలు పెడతారు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారగా మెగాస్టార్ కి ఏ కథ అప్పటికి ఇంటరెస్ట్ గా అనిపిస్తే అది మొదలు పెట్టె అవకాశం ఎక్కువగా ఉండగా ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమా తర్వాత చిరు…
ఏ సినిమా మొదలు పెడతాడు అన్నది అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. ఈ క్రమంలో మెగాస్టార్ ముందు లూసిఫర్ రీమేక్ ముందు నిలిచినప్పటికీ డైరెక్టర్ మారడం, కథ మార్పులు అంత బాగా మెప్పించక పోవడం తో కొంచం డౌట్ లో ఉన్నాడట చిరు, ఇప్పుడు మార్పుల భాద్యతని వినాయక్ కి…
అప్పగించారు అన్న టాక్ ఉన్నప్పటికీ ఒకవేళ మార్పులు నచ్చకపొతే కనుక బ్యాకప్ గా బాబీ డైరెక్షన్ లో కొత్త సినిమా చేసే అవకాశం కూడా ఉన్నప్పటికీ చిరు కి 5 ఏళ్ల క్రితం చేయాల్సిన సినిమా ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన రావడంతో సడెన్ గా ఫోకస్ ఆ సినిమా పై పడింది.
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాగా రావాల్సిన “ఆటోజానీ” కత్తి రీమేక్ వల్ల ఆగిపోగా కచ్చితంగా ఈ సినిమా మెగాస్టార్ తోనే చేయాలని పూరీ ఫిక్స్ అయ్యాడు. ఇక ఇప్పుడు పూరీ విజయ్ దేవరకొండ తో ఫైటర్ మూవీ తో బిజీగా ఉండగా ఇటు చిరు ఆచార్య తో బిజీగా ఉన్నాడు.
ఈ రెండు సినిమాలు కూడా వచ్చే సమ్మర్ ని టార్గెట్ చేసి రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండగా అప్పటికి లూసిఫర్ రీమేక్ కథ పెర్ఫెక్ట్ మార్పులతో సెట్ అయితే ఆ సినిమాను లేదా పూరీ తో ఆటోజానీ చేయాలనే ఆలోచనలో చిరు ఉన్నారని లేటెస్ట్ టాలీవుడ్ టాక్. లూసిఫర్ రీమేక్ కన్నా కూడా ఆటోజానీ అయితే బెటర్ అని మా ఫీలింగ్… మరి ఎం జరుగుతుందో చూడాలి మరి..