Home గాసిప్స్ సంక్రాంతి రేసులో ఎంటర్ అయ్యిన బిగ్గెస్ట్ మాస్ మూవీ!

సంక్రాంతి రేసులో ఎంటర్ అయ్యిన బిగ్గెస్ట్ మాస్ మూవీ!

0

టాలీవుడ్ బిగ్గెస్ట్ సీజన్స్ లో సంక్రాంతి అతి పెద్ద సీజన్… సంక్రాంతి కి రిలీజ్ అయ్యే సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసే కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తాయి అని ఇప్పటికే అనేక సార్లు ప్రూవ్ అవ్వ గా ఈ ఇయర్ సంక్రాంతి కి వచ్చిన రెండు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి భీభత్సం సృష్టించాయో అందరి కీ తెలిసిందే.

ఇక ఈ ఇయర్ కరోనా ఎఫెక్ట్ తో మొదటి మూడు నెలల తర్వాత టోటల్ గా థియేటర్స్ మూసి వేయగా అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో నెల రెండు నెలల్లో థియేటర్స్ తెరచుకునే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇక ఈ ఏడాది రిలీజ్ అయినా పెద్ద ప్రయోజనం లేదని…

భావించిన చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ ని వచ్చే ఇయర్ కి షిఫ్ట్ చేసుకోగా… వచ్చే ఇయర్ సంక్రాంతికి ఇప్పుడు తెలుగు లో రంగ్ దే సినిమా మరియు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలు రిలీజ్ ని కన్ఫాం చేసుకోగా ఇప్పుడు ఓ బిగ్గెస్ట్ మాస్ మూవీ కూడా రిలీజ్ కానుంది అని సమాచారం.

ఈ ఏడాది అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకు రావాల్సిన మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీ అయిన KGF2 ఇప్పుడు దసరా రేసు నుండి సంక్రాంతి రేసు లోకి ఎంటర్ కాబోతుంది అని సమాచారం. సంక్రాంతి కి అయితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఆల్ ఇండియా లెవల్ లో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంటుంది కాబట్టి…

KGF2 సినిమా సంక్రాంతి నే టార్గెట్ చేసి రిలీజ్ కాబోతుందని అంటున్నారు. సంక్రాంతి రేసులో ఈజీగా మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి టాలీవుడ్ లో మాత్రం అన్ని సినిమాలకు మంచి చాన్స్ ఉంటుందని చెప్పాలి. కానీ ఒక్కసారి KGF 2 కి హిట్ టాక్ వస్తే ఆ రచ్చ మరో లెవల్ లో ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here