టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన కొరటాల శివ తో కలిసి చేస్తున్న సినిమా ఆచార్య…. సైరా తర్వాత మెగాస్టార్ ఆల్ మోస్ట్ ఏడాదిగా ఈ సినిమా కోసమే పని చేస్తూ ఉండగా మరో పక్క కెరీర్ పీక్ టైం లో ఆచార్య కోసం కొరటాల శివ రెండున్నర ఏళ్ల టైం ని ఒక్క ఈ సినిమా కోసమే కేటాయించారు. కరోనా వలన షూటింగ్ లేట్ అయిన ఈ సినిమా….
బాలెన్స్ షూటింగ్ ఇంకా చాలా బాలెన్స్ ఉండగా కొంత భాగం కేరళలో షూటింగ్ జరగాల్సింది… ముందు ఈ లాంగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంటే చాలా వరకు షూటింగ్ అవుతుందని యూనిట్ భావించినప్పటికీ కూడా కేరళలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గు ముఖం పట్టక పోవడం తో…
మరింతగా డిలే అవుతూ వస్తుంది… దాంతో ఎదురు చూసి చూసి యూనిట్ ఒక షాకింగ్ డిసిషన్ ని తీసుకుందట… కేరళ ని మరిపించే ఓ భారీ సెట్ ని నిర్మించి ఇక్కడే సినిమా షూటింగ్ జరపాలని ఫిక్స్ అవ్వగా ప్రస్తుతం ఆ పనులలోనే యూనిట్ మొత్తం నిమగ్నమై ఉన్నారని సమాచారం.
మొత్తం మీద ఈ సెట్ ఒక్క దానికే అయ్యే ఖర్చు ఏకంగా 20 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఒక ఊరు ఊరునే ఈ సెట్ లో నిర్మిస్తున్నట్లు సమచారం. ఎక్కువ పోర్షన్ ని ఇక్కడే చిత్రీకరించబోతున్నారని అంటున్నారు. అందరి డేట్స్ ప్రాబ్లంస్ ఏమి రాకుండా ఈ సెట్ లోనే సినిమాను షూట్ చేయవచ్చని ఇలా చేస్తున్నారని తెలుస్తుంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ను ఇప్పుడు వచ్చే ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. మరి భారీ గ్యాప్ తర్వాత రాబోతున్న ఈ సినిమాతో మెగాస్టార్ అండ్ కొరటాల ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తారో చూడాలి మరి.