మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ లైనప్ పై అనేక రూమర్స్ ప్రచారం లో ఉన్నాయి… ముఖ్యంగా తన అప్ కమింగ్ మూవీస్ లో రీమేక్స్ కూడా ఉండటం తో ఇవి ఎందుకు అవి ఎందుకు అని ప్రశ్నలు వేసే వారు ఉన్నా తనకి నచ్చిన కథ లను ఎంచుకుంటూ ఆ కథలను మంచి మార్పులు చేర్పులు చేస్తూ సేఫ్ సైడ్ లోనే ఉంటూ ఆడియన్స్ ని అలరించాలి అన్నది చిరు ప్లాన్.
అందులో భాగమే తన అప్ కమింగ్ మూవీస్ లో 2 రీమేక్ లను ఎంచుకోవడం, ఒకటి లూసిఫర్ రీమేక్ కాగా మరొకటి వేదాలం రీమేక్ సినిమా. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న కొత్త కథ తర్వాత ఒక రీమేక్ చేయాలి అని ఫిక్స్ అయిన చిరు లూసిఫర్ రీమేక్ ని ఎంచుకున్నా…
ఆ కథ కి తెలుగు లో సరైన మార్పులు ఇప్పటికీ కుదరడం లేదట, వినాయక్ చేతికి చివరగా వెళ్ళిన ఈ సినిమా తెలుగు మార్పులు జరుగుతున్నా అవి పూర్తిగా సంతోష పడేలా లేక పోవడం తో మరింత టైం తీసుకోవాలని నిర్ణయం తీసుకోగా ఈ ప్లేస్ లో బాబీ తో సినిమా అనుకున్నా..
ఒక కొత్త కథ తర్వాత రీమేక్ చేయాలి అని ఫిక్స్ అయిన చిరు ఇప్పుడు సడెన్ గా వేదాలం రీమేక్ ని ముందుకు తీసుకు వచ్చాడు అన్నది లేటెస్ట్ టాక్. ఎప్పుడో రెండేళ్ళ తర్వాత మొదలు అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఆచార్య తర్వాత మొదలు కాబోతుంది, పెర్ఫెక్ట్ మాస్ ఎలిమెంట్స్, సిస్టర్ సెంటిమెంట్, హీరోయిజం….
ఇలా అన్ని ఉన్న ఈ సినిమా తెలుగు లో డబ్ కూడా కాలేదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ చేయడం బెటర్ అని ఫిక్స్ అయిన చిరు మెహర్ రమేష్ తో ఈ సినిమా ను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నాడట. సినిమా చిరు కి బాగా సెట్ అవుతుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర దంచికొట్టడం ఖాయమని చెప్పొచ్చు…