మెగాస్టార్ చిరంజీవి ఆచార్య డిసాస్టర్ తర్వాత సాలిడ్ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్న సినిమా గాడ్ ఫాదర్, మలయాళ లూసిఫర్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా పై అనుకున్న రేంజ్ లో బజ్ ఏర్పడటం లేదు, సినిమా నుండి ఇప్పటి వరకు ఒక్క టీసర్ మినహా ఎలాంటి అప్ డేట్స్ లేవు, కానీ సినిమా రిలీజ్ ను అక్టోబర్ 5న అని ఆల్ రెడీ అనౌన్స్ చేశారు మేకర్స్…
కానీ ఇప్పటి వరకు సినిమా నుండి కొత్త అప్ డేట్స్ ఏమి లేక పోవడంతో సినిమా దసరా రేసు నుండి తప్పుకుంది అంటూ వార్తలు టాలీవుడ్ లో సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో శిఖారు చేస్తూ ఉండగా ఆ వార్తలు సినిమా టీం వరకు వెళ్ళాయి…
దాంతో వెంటనే స్పందించిన నిర్మాత NV ప్రసాద్ గారు సినిమా పై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ఏమి నమ్మకండి అంటూ స్పందించారు… సినిమా ముందు అనౌన్స్ చేసినట్లే అక్టోబర్ 5న దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు రాబోతుందని కన్ఫాం చేశారు… ఇక ఒకటి తర్వాత ఒకటి సినిమా అప్ డేట్స్ ని…
ఇస్తామని చెబుతూ సినిమాలో నయనతార పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు…. కాగా ఇప్పుడు ఆచార్య ఫ్లాఫ్ ఎఫెక్ట్ గాడ్ ఫాదర్ పై ఉన్నా కానీ కచ్చితంగా అంచనాలను మించి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది అన్న నమ్మకంతో టీం ఉన్నారు. మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.