టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రీ ఎంట్రీ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకు పోతూ ఉండగా లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత భోలా శంకర్(Bholaa Shankar) మూవీతో భారీ డిసాస్టర్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఆ సినిమా తర్వాత….
తన కెరీర్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న విశ్వంభర(Vishwambhara Movie) మూవీతో వచ్చే సంక్రాంతికి రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ ఏది ఇప్పటి వరకు కన్ఫాం చేయలేదు….కాగా రీసెంట్ గా టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారం…
మెగాస్టార్ విశ్వంభర సినిమా తర్వాత చేయబోయే సినిమా ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యింది అన్న టాక్ వినిపిస్తుంది. అది ఎవరైనా టాప్ డైరెక్టర్ తో అనుకుంటే పొరపాటే….మెగాస్టార్ తో మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్(Lucifer Movie) తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్(God Father Movie) మూవీ తీసిన తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా(Mohan Raja)….
చెప్పిన మరో కథ అప్పట్లోనే మెగాస్టార్ కి నచ్చింది, కానీ గాడ్ ఫాదర్ తెలుగు రిజల్ట్ తీవ్రంగా నిరాశ పరచడంతో వీళ్ళ కాంబో మూవీ కాన్సిల్ అన్నట్లు టాక్ వచ్చింది, కానీ ఇప్పుడు బివిఎస్ రవి అందించిన కథకి మోహన్ రాజా మెరుగులు దిద్ది మెగాస్టార్ కి వినిపించడం, అది మెగాస్టార్ కి బాగా నచ్చడం జరిగింది అని టాక్ ఉంది….
మెగాస్టార్ బర్త్ డే టైంకి ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఉందని టాక్ వస్తుంది…భారీ బడ్జెట్ తో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు, కానీ గాడ్ ఫాదర్ రిజల్ట్ తర్వాత వీళ్ళ కాంబోలో మూవీ అంటే అందరూ కొంచం కంగారు పడటం ఖాయం, కానీ ఫ్లాఫ్ కాంబోలో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన చరిత్రలు చాలానే ఉన్నాయి. ఇక వీళ్ళ కాంబో అఫీషియల్ గా కన్ఫాం అయితే ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఎలాంటి కంబ్యాక్ సొంతం అవుతుందో చూడాలి ఇక…