Home న్యూస్ మోస్ట్ అవైటెడ్ అప్ డేట్ వచ్చేసింది…ఫ్యాన్స్ ఖుషి….కానీ!

మోస్ట్ అవైటెడ్ అప్ డేట్ వచ్చేసింది…ఫ్యాన్స్ ఖుషి….కానీ!

0

ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత ఈ ఇయర్ లో దేవర(Devara Part 1 Movie) తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR)ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి చేస్తున్న వార్2(War 2 Movie) వచ్చే ఏడాది రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఆ సినిమా కన్నా ముందే…

కన్ఫాం అయిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) ల కాంబోలో రూపోందే NTRNEEL మూవీ ఎప్పుడు మొదలు అవుతుంది లాంటి అప్ డేట్స్ కోసం అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా రీసెంట్ ఎన్టీఆర్ తో సినిమా కన్నా ముందు ప్రభాస్(Prabhas) తో సలార్(Salaar 2 Movie) మొదలు పెట్టె పనిలో ప్రశాంత్ నీల్ ఉన్నాడని టాక్ రాగా…

వాటికి చెక్ పెడుతూ ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ల సినిమా అప్ డేట్ ను అఫీషియల్ గా కన్ఫాం చేశారు. కాగా వీళ్ళ కాంబోలో వస్తున్న సెన్సేషనల్ మూవీ ఈ ఇయర్ లోనే మొదలు కాబోతుందని అనౌన్స్ చేశారు… కాగా సినిమా షూటింగ్ ఈ ఆగస్టు నుండి మొదలు కాబోతుందని అనౌన్స్ చేశారు మేకర్స్….

అప్పటి నుండి సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా ఉంటుందని చెప్పారు..దాంతో ఫ్యాన్స్ మోస్ట్ అవైటెడ్ అప్ డేట్ రావడంతో ఫుల్ ఖుషిగా ఉన్నారని చెప్పాలి. కానీ అదే టైంలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వీళ్ళ కాంబో మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుంది అని న్యూస్ రీసెంట్ గా లీక్ అయింది…

వీళ్ళ కాంబోలో మూవీ కి  డ్రాగన్(JR NTR DRAGON Movie) అనే పవర్ ఫుల్ టైటిల్ ను టాక్ రాగా అదే అనౌన్స్ చేస్తారు అని అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు, కానీ టైటిల్ ను అనౌన్స్ చేయకుండా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నది అప్ డేట్ చేశారు… అప్ కమింగ్ టైంలో రిలీజ్ కానున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన ఈ సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here