Home న్యూస్ హిట్టు కొట్టి చాలా ఏళ్ళు…ఈ సినిమాతో మాస్ కంబ్యాక్ ఖాయం ఇక!

హిట్టు కొట్టి చాలా ఏళ్ళు…ఈ సినిమాతో మాస్ కంబ్యాక్ ఖాయం ఇక!

0

టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరిగా పేరున్న వాళ్ళలో మంచు మనోజ్(Manchu Manoj) ఒకరు…ఒక టైంలో మంచు హీరోలు అందరిలో కూడా డీసెంట్ మార్కెట్ ను సొంతం చేసుకున్న మంచు మనోజ్ సరైన సినిమాలు ఎంచుకోక పోవడంతో తన మార్కెట్ ను కోల్పోతూ రాగా తర్వాత వ్యక్తిగత కారణాల వలన సినిమాలకు దూరంగా ఉంటూ వస్తూ ఉండగా….

భారీ గ్యాప్ తర్వాత ఇప్పుడు సాలిడ్ కంబ్యాక్ కి సిద్దం అవుతున్నాడు, హీరోలానే కంబ్యాక్ ఇస్తాడని అనుకున్నా అద్బుతమైన కథ ఆఫర్ వచ్చిందని, అందుకే ఏకంగా నెగటివ్ రోల్ లో కనిపించడానికి కూడా వెనకడుగు వేయకుండా ఓకే చేసి ఇప్పుడు మిరాయ్(Mirai Movie) తో ఆడియన్స్ ముందుకు వచ్చే ఏడాది రాబోతున్నాడు.

హనుమాన్(HanuMan Movie) తో సంచలనం సృష్టించిన తేజ సజ్జ(Teja Sajja) హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ రెండు పార్టులుగా ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా ఫస్ట్ పార్ట్ వచ్చే ఇయర్ సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో మోస్ట్ పవర్ ఫుల్ నెగటివ్ రోల్ లో మంచు మనోజ్ కనిపించబోతూ ఉండగా…

రీసెంట్ గా సినిమా నుండి తన ఇంట్రో వీడియోని తన పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు, కొంత టైం క్రితం లుక్స్ పరంగా కొంచం షేప్ ఔట్ అయిన మనోజ్ ఈ సినిమా కోసం తిరిగి ఫుల్ ఫిట్ గా మారిపోయి అదరగొట్టేశాడు, తన స్క్రీన్ ప్రజెన్స్ కూడా మెప్పించగా ఓవరాల్ గా కొత్తగా చేస్తున్న ఈ నెగటివ్ రోల్ తో తన కెరీర్ లో…

ఇప్పుడు సాలిడ్ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్నాడు అని చెప్పాలి. సినిమా ఏమాత్రం అంచనాలను అందుకున్నా మంచు మనోజ్ చేస్తున్న నెగటివ్ రోల్ కి తన అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ తో మరో లెవల్ లో రీచ్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాతో మనోజ్ కి ఏ రేంజ్ లో కంబ్యాక్ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here