Home గాసిప్స్ ఉదయ్ కిరణ్ లాస్ట్ మూవీ OTT రిలీజ్….ఈ సారి కన్ఫాం అంటున్నారు…సాలిడ్ రేటు!!

ఉదయ్ కిరణ్ లాస్ట్ మూవీ OTT రిలీజ్….ఈ సారి కన్ఫాం అంటున్నారు…సాలిడ్ రేటు!!

0

ఎలాంటి స్టార్ బ్యాగ్రౌండ్ లేకుండా సూపర్ సక్సెస్ అయిన అతి కొద్ది మంది లో ఉదయ్ కిరణ్ ఒకరు… కెరీర్ స్టార్టింగ్ లోనే వరుస విజయాలతో అప్ కమింగ్ హీరోల్లో ఎవ్వరూ సాధించలేని రికార్డులు క్రియేట్ చేసిన హీరో ఉదయ్ కిరణ్… మొదటి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలవ గా తర్వాత చేసిన కలుసు కోవాలనీ మరియు శ్రీరామ్ సినిమా లు కూడా మెప్పించినప్పటి కీ తర్వాత సినిమా లు మాత్రం అంచనాలను అందుకోక పోవడం తో కెరీర్ పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యింది.

దానికి తోడూ వ్యక్తిగత కారణాలు కూడా తోడు అవ్వడం తో అన్నీ తట్టుకోలేక ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని వీడి వెళ్ళాడు. తను చేసిన చివరి సినిమాల్లో ఒక్క సినిమా మాత్రం తనకి బాగా నచ్చిన సినిమా అదే చివరి సినిమా అయ్యింది.

అదే చిత్రం చెప్పిన కథ సినిమా… ఈ సినిమా రిలీజ్ తర్వాత తన లైఫ్ మళ్ళీ జోరు అందుకుంటుంది అనుకున్న అలా జరగలేదు, సినిమా రిలీజ్ నిరవధికంగా ఆగిపోగా… 2020 ఫస్ట్ వేవ్ లో ఈ సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు కానీ ఎందుకనో రేటు వర్కౌట్ అవ్వకో ఇంకా ఏదైనా కారణాల వలనో డీల్ సెట్ కాలేదు…

కానీ ఇప్పుడు మళ్ళీ సెకెండ్ వేవ్ లో అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం తో చాలా సినిమాలు డిజిటల్ రిలీజ్ వైపు మొగ్గు చూపుతుండగా ఈ సినిమా ను ఈ సారి ఎలాగైనా డిజిటల్ రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. రేటు కూడా బాగానే పెరిగినట్లు తెలుస్తుంది… సినిమా కి రేటు 3 కోట్లకి అటూ ఇటూగా రేటు ఆఫర్ దక్కిందని టాలీవుడ్ ట్రేడ్ లో వార్తలు ప్రచారం లో ఉన్నాయి.

ఇది అనుకున్న రేటు కన్నా కూడా డబుల్ ఆఫర్ అనే చెప్పాలి… ఉదయ్ కిరణ్ ని చివరి సారి చూడాలి అని అనుకోని ఫ్యాన్స్ అలాగే కామన్ ఆడియన్స్ లేరు… అందుకే ఈ సినిమా ను త్వరలో నే డిజిటల్ రిలీజ్ మంచి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరి ఈ సారి అయినా సినిమా డిజిటల్ లో రిలీజ్ అయ్యి ఉదయ్ కిరణ్ ని మరొక్క సారి చూసే చాన్స్ ఉంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here