బాక్స్ ఆఫీస్ దగ్గర చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ కోబ్రా ఆడియన్స్ ముందుకు వినాయక చవితి హాలిడే కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా ఓవరాల్ కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కూడా లెంత్ మరీ ఎక్కువ అవ్వడం, ఓవరాల్ కథ కన్ఫ్యూజన్ గా ఉండటంతో ఆడియన్స్ నుండి కంప్లీట్ గా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా ఆ ఇంపాక్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ పై పడుతుంది అనుకున్నా…
సినిమా ఇప్పుడు ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని అందుకుంది, తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని మాగ్జిమం అందుకోవచ్చు అనుకుంటే సినిమా ఆఫ్ లైన్ లో డే ఎండ్ టైం లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ని…
చూపించి మొత్తం మీద మొదటి రోజు టోటల్ గా అంచనాలను అన్నీ కూడా డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఫ్లాఫ్ టాక్ తో ఏకంగా 2.28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. 3.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 66L
👉Ceeded: 28L
👉UA: 40L
👉East: 23L
👉West: 14L
👉Guntur: 21L
👉Krishna: 24L
👉Nellore: 12L
AP-TG Total:- 2.28CR(3.75Cr~ Gross)
ఇక సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 12.10Cr
👉Telugu States- 3.75Cr
👉Karnataka- 2.15Cr
👉Kerala – 1.65Cr
👉ROI – 0.90Cr
👉Overseas – 3.90CR~
Total WW collection – 24.45CR(12.60CR~ Share)
మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాలలో అంచనాలను మించిపోగా 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇంకా 2.72 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వరల్డ్ వైడ్ వర్త్ బిజినెస్ 60 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. ఇక వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.