Home గాసిప్స్ సోలో బ్రతుకే సో బెటర్….సెన్సార్ టాక్ వచ్చేసింది….టాక్ ఏంటంటే!

సోలో బ్రతుకే సో బెటర్….సెన్సార్ టాక్ వచ్చేసింది….టాక్ ఏంటంటే!

1

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నబా నటేష్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, సినిమా మొత్తం మీద 38 కోట్ల రేటుకి జీ నెట్ వర్క్ వాళ్ళు టోటల్ రైట్స్ ని సొంతం చేసుకోగా సినిమాను వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలలో దిల్ రాజు మరియు యువి క్రియేషన్ వాళ్లకి మొత్తం మీద 8 కోట్ల రేటుకి అమ్మారు.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 8.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా సినిమా సెన్సార్ పనులను ఎప్పుడో కంప్లీట్ చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమా టోటల్ రన్ టైం వివరాలను గమనిస్తే…

మొత్తం మీద 2 గంటల 6 నిమిషాల రన్ టైం కలిగిన ఈ సినిమా ఇనీషియల్ టాక్ ఏంటి అనేది ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, ఆ టాక్ ప్రకారం చూసుకుంటే ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ గా ఉంటూ కామెడీ సీన్స్ తో బాగానే మెప్పిస్తుందట ఈ సినిమా… ఇక సెకెండ్ ఆఫ్ విషయానికి వస్తే…

కొంచం స్లోగా ఉంటుందని, కొంచం సీరియస్ గా కూడా ఉంటుందని అంటున్నారు, ఫస్టాఫ్ మాత్రం ఫుల్ కామెడీ తో ఆకట్టుకుంటే సెకెండ్ ఆఫ్ కొంచం పడుతూ లేస్తూ సినిమా కథ సాగుతుందని అంటున్నారు, కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం బాగుంటుంది అన్నది ఓవరాల్ గా ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్ అని చెప్పాలి. సినిమాకి ఇలాంటి టాక్ క్రిస్టమస్ హాలిడేస్ లో సరిపోతుంది…

అని చెప్పాలి, లిమిటేషన్స్ ఉన్నా కానీ ఉన్నంతలో ఎలాంటి పోటి లేకుండా సినిమా బాక్స్ ఆఫీస్ ను సంక్రాంతి వరకు ఏలే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఇక సినిమా తో సాయి ధరం తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తానన్న ధీమా తో ఉన్నాడు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని జనాలను థియేటర్స్ కి రప్పిస్తారో చూడాలి.

1 COMMENT

  1. S after watching the movie u will definitely say that SBSB is wrong haha….. Nice and a pleasant movie after a long time. It\\\’s true SBSB is not possible after few years some1 has to be withus

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here