Home న్యూస్ రాక్షసుడు పరువు తీశారుగా….ఇదేం రీమేక్ రా బాబు!!

రాక్షసుడు పరువు తీశారుగా….ఇదేం రీమేక్ రా బాబు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పుడు ఒకటికి మించి ఒకటి కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చేవి కానీ తర్వాత మాత్రం ఆడియన్స్ కి నచ్చే కంటెంట్ చేయడం మానేసి రీమేక్ లు మాస్ కంటెంట్ లు ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా చేస్తూ ఇప్పుడు కంప్లీట్ గా ఫామ్ కోల్పోగా ఒకటి తర్వాత ఒకటి రీమేక్ సినిమాలతో ఒరిజినల్స్ ని కూడా ఏమాత్రం ఇంప్రెస్ చేయకుండా చేస్తున్నారు. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు….

థియేటర్స్ లో కాకుండా డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమా చూసి సౌత్ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటె నార్త్ వాళ్ళు ఆ సినిమానే అద్బుతం అనుకుంటున్నారు. ఆ సినిమానే ఎపిక్ థ్రిల్లర్ మూవీ రాక్షసుడు మూవీ హిందీ రీమేక్ కట్ పుత్లీ సినిమా…

తమిళ్ లోనే కాదు తెలుగు లో కూడా ఈ సినిమా కి వచ్చిన రెస్పాన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పాలి..తమిళ్ వర్షన్ ని ఏమాత్రం చెడగొట్టకుండా తెలుగు వర్షన్ ని రీమేక్ చేయగా…. సౌత్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను హిందీలో ఎదో మొక్కుబడిలా అక్షయ్ కుమార్ రీమేక్ చేయగా స్టొరీ పరంగా అదే కథని కొన్ని కొన్ని చిన్న మార్పులతో…

మార్చగా కోర్ కథ అలానే తీసుకున్నా కానీ అందులో ఉన్న ఇంపాక్ట్ ని హిందీలో అస్సలు రీ క్రియేట్ చేయలేక పోయారు, బ్యాగ్రౌండ్ స్కోర్ తీవ్రంగా నిరాశ పరచగా విలన్ ఫ్లాష్ బ్యాక్ కానీ కిడ్నాప్ సీన్స్ ని కానీ ఎలాంటి థ్రిల్ ఎలిమెంట్స్ లేకుండా తెరకెక్కించారు. ఇక క్లైమాక్స్ కూడా మినిమమ్ ఇంపాక్ట్ ని చూపించలేక పోయింది. దాంతో సౌత్ వర్షన్ లు చూసిన వాళ్ళు…

ఇదేం రీమేక్ రా బాబు అంటూ రాక్షసుడు పరువు తీశారు అంటూ కామెంట్స్ చేస్తుంటే ఒరిజినల్ వర్షన్ ని చూడని వాళ్ళు మాత్రం సినిమా పర్వాలేదు బానే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు… కానీ ఒరిజినల్ తో కంపేర్ చేస్తే మట్టుకు ఈ సినిమా కి 10 మార్కులకు పాస్ మార్కులు కూడా పడవు అని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here