Home న్యూస్ ఫస్ట్ డే ట్రేడ్ లెక్క….చరిత్రకెక్కే షాక్ ఇది!

ఫస్ట్ డే ట్రేడ్ లెక్క….చరిత్రకెక్కే షాక్ ఇది!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ మహానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు, సినిమా అనుకున్న కలెక్షన్స్ ఒకటి మొదటి రోజు ట్రేడ్ లెక్కల్లో వచ్చిన కలెక్షన్స్ ఒకటి. ఎవ్వరి ఊహలకు అందని విధంగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా చారిత్రిక డిసాస్టర్ లెవల్ లో సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రావడం ఇప్పుడు టోటల్ టాలివుడ్ కే షాక్ గా ఉంది.

సినిమా మొదటి రోజు బాలయ్య కున్న స్టార్ పవర్ తో మినిమం 2.5 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో అయినా కలెక్షన్స్ ని అందుకుంటుంది అని అందరు భావించారు, కానీ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా మొదటి రోజు ట్రేడ్ లెక్కల ప్రకారం కలెక్షన్స్ ని చూస్తె….

Nizam : Rs 9 Lakhs Ceded : Rs 15 Lakhs UA : Rs 12 Lakhs Guntur : Rs 6 Lakhs Krishna : Rs 14 Lakhs East : Rs 2.2 Lakhs West : Rs 2.8 Lakhs Nellore : Rs 4 Lakhs Total AP/ TS Share : Rs 65 Lakhs…. ఇదీ పరిస్థితి అక్షరాలా 65 లక్షల షేర్ ని ట్రేడ్ లెక్కల్లో మొదటి రోజు అందుకుంది.

కాగా ఇంకా నిర్మాతలు అనౌన్స్ చేసే కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది ఆసక్తి గా మారింది, ఏది ఏమైనప్పటికీ సినిమా ఈ రేంజ్ లో షాక్ ఇస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు, అసలు ఈ కలెక్షన్స్ చూస్తుంటే ఫ్యాన్స్ కూడా తొలిరోజు సినిమా చూడలేదేమో అనిపించే విధంగా…

మినిమం ఓపెనింగ్స్ లేకుండా రన్ అయిన ఈ సినిమా రోజు మొత్తం మీద సాధించిన ఈ షాకింగ్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో ఎలా పుంజుకుంటుందో అని అందరు ఆందోళన పడుతున్నారు. ఇక నిర్మాతల లెక్క ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here