Home న్యూస్ ఎన్టీఆర్ మహానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్…ఊహకందని షాక్ ఇది!

ఎన్టీఆర్ మహానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్…ఊహకందని షాక్ ఇది!

0

     మొదటి నుండే అనుకున్నదే జరుగుతూ వచ్చింది, నట సింహం బాలయ్య రీసెంట్ మూవీస్ తో పోల్చితే ప్రేస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ తో బాక్స్ ఆఫీస్ ఊచకోత కోస్తాడు అనుకున్నా ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ టాక్ బాగున్నా అంచనాలు అందుకోలేక చతికిల బడి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే కలెక్షన్స్ తో ఫైనల్ రన్ లో చారిత్రిక డిసాస్టర్ గా మిగిలి పోయింది. ఇక ఇప్పుడు ఆ నష్టాలను భర్తీ చేయడానికి వచ్చిన…

రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు బాలయ్య కెరీర్ లో రీసెంట్ టైం లో అత్యంత తక్కువ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా నిలిచింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో ఏమాత్రం గ్రోత్ ని చూపలేక పోయిందన్న విషయం తెలిసిందే.

ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల విషయం లో ఫ్యామిలీ ఆడియన్స్ కామన్ ఆడియన్స్ తో భారీ గ్రోత్ ని అందుకుంటుంది అనుకున్నా అలా జరగలేదు. సినిమా మొదటి రెండు షోల కి ఫైనల్ గా 18% నుండి 20% వరకు ఆక్యుపెన్సీ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించగా…

ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి ఫైనల్ గా గ్రోత్ 30% కి పైగానే ఉంటుంది అనుకున్నా అలా జరగలేదు. సినిమా మొత్తంగా 25% లోపే ఆన్ లైన్ బుకింగ్స్ ని అందుకుంది, ఆఫ్ లైన్ పూర్తీ వివరాలు క్లియర్ గా తెలియరాలేదు. దాంతో సినిమా మొదటి రోజు…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ గా 3 కోట్ల కి అటూ ఇటూ గానే కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని సమాచారం. ఇది ముందు రోజు అంచనా వేసిన మొత్తమే అవ్వడం విచారకరం. మరి మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here