వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయిన రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 550 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అనుకున్నా ఆంధ్రా లో సినిమా బ్యాన్ చేయడం తో నైజాం లోనే సుమారు 250 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వేట ని కొనసాగిస్తుంది, మేజర్ కలెక్షన్స్ ఇప్పుడు నైజాం ఏరియా నుండే రావాల్సిన అవసరం నెలకొంది అని చెప్పాలి.
కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నైజాం ఏరియా కి గాను మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల సమయం లో ఆన్ లైన్ టికెట్ సేల్స్ సుమారు 40% వరకు ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి గ్రోత్ ని సాధించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఓవరాల్ గా…
55% వరకు ఆన్ లైన్ బుకింగ్స్ తో జోరు చూపింది, చాలా మంది సినిమా నైజాం లో కూడా ఆపేశారు అనుకోవడం తో కలెక్షన్స్ కి కొద్దిగా ఎఫెక్ట్ చూపింది, ఇక ఇదే లెక్కల ప్రకారం అయితే తొలిరోజు సినిమా ఇక్కడ 65 లక్షల రేంజ్ షేర్ పక్కా అని చెప్పాలి. ఇక ఆఫ్ లైన్…
టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే కనుక సినిమా ఇక్కడ మొదటి రోజు 80 లక్షల కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, తొలిరోజు వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.2 కోట్ల నుండి 1.5 కోట్ల మధ్యలో షేర్ ని సాధించే అవకాశం ఉంది,
ఆంధ్రా లో కూడా రిలీజ్ అయ్యి ఉంటె తొలిరోజు వరల్డ్ వైడ్ గా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండేది, కానీ అక్కడ బ్యాన్ అవ్వడం తో సినిమా కలెక్షన్స్ కొద్ది కొద్దిగా నే లాంగ్ రన్ లో జోరు చూపేలా ఉంటాయని చెప్పొచ్చు, మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.