కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ మన్మథుడు 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది, కాగా సినిమా ఇప్పుడు మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది, కాగా తొలిరోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు మొత్తం మీద 45% వరకు ఆక్యుపెన్సీ ని సినిమా సొంతం చేసుకుంది, ఇక మొత్తం మీద ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి…
ఫైనల్ గా 50% కి పైగా ఆక్యుపెన్సీ తో రన్ అయ్యింది, కానీ ఇదంతా ఆన్ లైన్ టికెట్ సేల్స్ కి సంభందించిన న్యూస్ మాత్రమె సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కి కొన్ని చోట్ల వర్షాలు ఎదురుదెబ్బ కొట్టగా కొన్ని చోట్లా స్లోగానే రన్ అయ్యింది. దాంతో ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై పడే చాన్స్ ఉంది.
సినిమా ఉన్నంతలో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి పై లెక్కల ప్రకారం అయితే 2.5 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని చెప్పొచ్చు. గ్రోత్ ఎక్కువ గా ఉంటే లెక్క 2.7 కోట్లకు పై నుండే మొదలు అయ్యేది కానీ ఓవరాల్ ఆక్యుపెన్సీ పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేదు, కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుండి…
మాస్ సెంటర్స్ లో కూడా రోజు మొత్తం జోరు చూపితే ఈ లెక్క 2.8 కోట్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సినిమా 3.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, కానీ సినిమా బిజినెస్ ను దాటి బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే….
19.5 కోట్ల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ బరిలో సాధించాల్సి ఉంటుంది, అంటే వీకెండ్ మొత్తం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత జోరుగా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది, మరి మొదటి రోజు సినిమా అఫీషియల్ గా ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.