Home న్యూస్ ఎన్టీఆర్ మహానాయకుడు ఫస్ట్ డే ఓపెనింగ్స్…దిమ్మతిరిగే షాక్!

ఎన్టీఆర్ మహానాయకుడు ఫస్ట్ డే ఓపెనింగ్స్…దిమ్మతిరిగే షాక్!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్ల మూడి కాంబినేషన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత తెరకెక్కిన సినిమా ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ రిజల్ట్ తర్వాత కొంచం గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 900 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసు కుందాం పదండీ…

మార్నింగ్ షో కి ఓవరాల్ గా 15% లోపే బుకింగ్స్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ మహానాయకుడు మ్యాట్నీ షో కి కేవలం 3% వరకు మాత్రమె గ్రోత్ ని సాధించింది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ స్టేటస్ చాలా స్లో గా ఉండటం అందరికీ షాక్ కి గురి చేస్తుంది.

సినిమా మొత్తం మీద నైజాం, ఆంధ్రా సీడెడ్ ఇలా అన్ని ఏరియాల్లో కూడా ఈక్వల్ లెవల్ లో స్లో గా స్టార్ట్ అవ్వడం షాక్ ని కలిగిస్తుంది, బాలయ్య మాస్ ఫ్యాన్స్ భారీ గానే ఉన్నా సినిమా కంటెంట్ దృశ్యా అందరు అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రాలేదు అన్నది సత్యం.

దాంతో సినిమా ఫైనల్ గా మొదటి రోజు కలెక్షన్స్ ప్రభావం కామన్ ఆడియన్స్ రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుంది అన్న దాని పైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని బట్టి చూస్తె ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్…

30 టు 35% రేంజ్ లో ఉన్నా కానీ 3 కోట్ల నుండి 3.5 కోట్ల లోపే ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది, అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టే తెలుస్తుంది, మరి ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ ఎలా ఉంటుందో చూసి ఎంత కలెక్ట్ చేయచ్చో అప్ డేట్ చేస్తాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here