అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ని సాధించిన విషయం తెలిసిందే, ఓవరాల్ గా 8.1 కోట్ల లోపు షేర్ తో సెన్సేషనల్ స్టార్ట్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.
ఇకబాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు కూడా సాలిడ్ స్టార్ట్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా…రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ షోల కి ఓ రేంజ్ లో ఆక్యుపెన్సీ ని సాధించింది. ఓవరాల్ గా 35 టు 40 పెర్సెంట్ ఆక్యుపెన్సీ ని అందుకుంది.
ఈ లెక్కన ఈవినింగ్ షోలకి ఈ గ్రోత్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో రెండో రోజు సినిమా కలెక్షన్లు కూడా బాగానే ఉండటం ఖాయమని అంటున్నారు. ట్రేడ్ లెక్కల ప్రకారం రెండో రోజు 3.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.