Home న్యూస్ మగధీర@95 కోట్ల షేర్…9 ఏళ్ళు అయినా రికార్డులు కంటిన్యూ!

మగధీర@95 కోట్ల షేర్…9 ఏళ్ళు అయినా రికార్డులు కంటిన్యూ!

0

టాలీవుడ్ ఆల్ టైమ్ ఎపిక్ వండర్స్ లో ఒకటైన సినిమా మగధీర…తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన ఈ సినిమా సృష్టించిన రికార్డులు ఎన్నో ఎలాంటివో అందరికీ తెలిసిందే. రిలీజ్ అయ్యి 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా జపాన్ లో సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది ఈ సినిమా.

కాగా ఈ సినిమా తెలుగు వర్షన్ ని కాను 73.58 కోట్ల షేర్ ని, తమిళ్ కి గాను 10 కోట్ల షేర్ ని మరియు మలయాళం కి గాను 1.5 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా 85 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు జపాన్ లో రిలీజ్ అయ్యి సంచలన కలెక్షన్స్ తో రీసెంట్ గా 20 కోట్ల గ్రాస్ ని అందుకుంది.

దాంతో అక్కడ సినిమాను ఎలా కొన్నారో తెలియదు కానీ టోటల్ గ్రాస్ లో సగం షేర్ వస్తుంది అన్న టాక్ గట్టిగా వినిపిస్తున్న నేపధ్యంలో మగధీర టోటల్ షేర్ ఇప్పటి వరకు 95 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందని చెప్పొచ్చు. త్వరలోనే 100 కోట్ల షేర్ ని అందుకున్నా ఆశ్యర్య పోనవసరం లేదు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here