Home న్యూస్ శైలజా రెడ్డి అల్లుడు డే 1 Vs గీత గోవిందం డే 1…విన్నర్ ఎవరంటే?

శైలజా రెడ్డి అల్లుడు డే 1 Vs గీత గోవిందం డే 1…విన్నర్ ఎవరంటే?

0

రీసెంట్ గా టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో ఓపెనింగ్స్ పరంగా దుమ్ము లేపుతున్న సినిమాలు పెరుగుతున్నాయి. టాక్ బాగుంటే మీడియం రేంజ్ మూవీస్ కూడా దున్నేస్తున్నాయి.. వాటిలో గీత గోవిందం హిస్టారికల్ రికార్డులు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డులను శైలజా రెడ్డి అల్లుడు వెంబడిస్తుంది.

కాగా ముందుగా మొదటి రోజు కలెక్షన్స్ ని చూసుకుంటే నైజాంలో గీత గోవిందం 1.75 కోట్లు వసూల్ చేస్తే…శైలజా రెడ్డి అల్లుడు 2.5 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక ఆంధ్రా సీడెడ్ లలో కూడా లీడ్ కొనసాగింది. మొత్తం మీద మొదటి రోజు రెండు రాష్ట్రాలలో గీత గోవిందం 5.8 కోట్ల షేర్ ని అందుకోగా శైలజా రెడ్డి అల్లుడు ఆల్ మోస్ట్ 6.9 కోట్ల షేర్ ని అందుకుంది.

కానీ రెండు రాష్ట్రాల ఆవల టోటల్ గా గీత గోవిందం 4 కోట్ల షేర్ ని అందుకుంది…కానీ శైలజా రెడ్డి అల్లుడు 1.1 కోట్ల షేర్ ని అందుకుంది…దాంతో గీత గోవిందం మొదటి రోజు టోటల్ గా 9.8 కోట్ల షేర్ ని అందుకోగా శైలజా రెడ్డి అల్లుడు 8.1 కోట్ల లోపు కలెక్షన్స్ ని అందుకుంది. ప్రస్తుతానికి గీత గోవిందం 1.7 కోట్ల లీడ్ తో ఉంది. రెండో రోజు ఎలా ఉంటుందో రేపు అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here