బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ లైగర్ ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా ప్రీమియర్స్ తర్వాత యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోలకు మిక్సుడ్ రెస్పాన్స్ రాగా సోహల్ మీడియాలో కంప్లీట్ గా నెగటివ్ టాక్ అంతటా స్ప్రెడ్ అయింది అని చెప్పాలి… దాంతో ఆ ఇంపాక్ట్…
సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల పై కూడా క్లియర్ గా కనిపిస్తుంది… ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కామన్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఫైనల్ గా ఎలాంటి టాక్ వచ్చింది అన్నది ఆసక్తిగా మారగా ఫ్యామిలీ ఆడియన్స్ మరీ అనుకున్న రేంజ్ లో తరలిరాలేదు కానీ…
ఉన్నంతలో వచ్చిన వాళ్ళ నుండి వినిపిస్తున్న టాక్ మాస్ ఎలిమెంట్స్ మరీ ఎక్కువ అవ్వడం, ఎమోషనల్ టచ్ అస్సలు లేక పోవడం, హీరోకి నత్తి అస్సలు సెట్ అవ్వలేదు అంటూ, హీరోయిన్ ట్రాక్ మినిమమ్ ఇంపాక్ట్ లేక పోవడం, మొత్తం మీద సినిమా విజయ్ దేవరకొండ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ తప్పితే….
ఏమాత్రం ఆకట్టుకోలేదని అంటున్నారు… ఇక కామన్ ఆడియన్స్ నుండి వినిపిస్తున్న టాక్ కంప్లీట్ గా నెగటివ్ గా ఉందని చెప్పాలి. కొన్ని సీన్స్ తప్పిస్తే సినిమా కంప్లీట్ గా ట్రాక్ తప్పినట్లు ఉందని అంటున్నారు… మొత్తం మీద సినిమా కి డే ఎండ్ అయ్యే టైం కి కంప్లీట్ గా నెగటివ్ టాకే ఎక్కువగా వినిపిస్తుందని చెప్పాలి… మొత్తం మీద అద్బుతమైన ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా…
లైగర్ మూవీ ఆ ఛాన్స్ ను సరిగ్గా వాడుకోవడంలో విఫలం అయిందని చెప్పొచ్చు…. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి లాంగ్ వీకెండ్ లో ఇప్పుడు ఎలాంటి కలెక్షన్స్ సొంతం అవుతాయి అన్నది ఆసక్తికరం. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఈ నెగటివ్ టాక్ ఎంత లాగుతుందో చూడాలి ఇక.