బాక్స్ ఆఫీస్ దగ్గర నార్మల్ గా డే 1 తో పోల్చితే డే 2 కలెక్షన్స్ లో డ్రాప్స్ కనిపిస్తాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రమె డే 1 కలెక్షన్స్ కన్నా కూడా డే 2 కలెక్షన్స్ పరంగా గుడ్ హోల్డ్ ని చూపించి గ్రోత్ ని కూడా చూపిస్తూ ఉంటాయి, ఇప్పుడు ఇలాంటి హోల్డ్ అండ్ గ్రోత్ నే చూపిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు లో కొనసాగుతున్న ఒకే ఒక జీవితం సినిమా…
మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది. సినిమా బాక్స్ ఆఫీస్ అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా ఓపెనింగ్ డే రోజున బ్రహ్మాస్త్ర సినిమా తో పోటి వలన ఇంపాక్ట్ ని చూపించలేక పోయింది. కానీ రెండో రోజుకి వచ్చే సరికి మాత్రం…
పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఉన్నంతలో మరీ అద్బుతం కాదు కానీ బెటర్ కలెక్షన్స్ తోనే హోల్డ్ చేస్తుంది, ఓవరాల్ గా డే 1 తో పోల్చితే డే 2 కుమ్ముతుంది అనే చెప్పాలి ఉన్న లిమిటెడ్ రిలీజ్ లోనే ఈ సినిమా, కానీ సినిమా కి వచ్చిన టాక్ కి అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం.
ఇంకా బెటర్ గా కుమ్మేయాల్సింది కానీ పోటి వలన శర్వానంద్ బ్యాడ్ ఫామ్ ఇంపాక్ట్ వలన సినిమా అనుకున్న రేంజ్ లో అయితే వెళ్ళడం లేదు, కానీ సూపర్బ్ పాజిటివ్ టాక్ ఉండటంతో లాంగ్ రన్ ని మాత్రం సినిమా అందుకోవచ్చు… ఇక రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 80 నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, మరి టోటల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు సాలిడ్ గా ఉండి ఈ అంచనాలను కూడా సినిమా మించిపోతుందో లేక ఇదే రేంజ్ లో ఉంటుందో చూడాలి.