Home న్యూస్ 5 సినిమాల డే 2 కలెక్షన్స్…KGF కుమ్ముడు

5 సినిమాల డే 2 కలెక్షన్స్…KGF కుమ్ముడు

0

       వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 5 సినిమాల లో మొదటి రోజు కొన్ని సినిమాలు అంచనాలు తప్పగా కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించాయి… కానీ KGF మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాల ను మించి కలెక్షన్స్ ని సాధించింది. ఇక ఈ సినిమాల బాక్స్ ఆఫీస్ రెండో రోజు కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తి గా మారగా ఒక్కో సినిమా ప్రదర్శన ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ.

ముందుగా పడిపడిలేచే మనసు మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ ఏకంగా 50% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. దాంతో రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉంది.

ఇక అంతరిక్షం సినిమా మొదటి రోజే అంచనాలను తప్పగా రెండో రోజు కూడా కొన్ని సెంటర్స్ లోనే పర్వాలేదు అనిపించింది. మాస్ సెంటర్స్ లో అసలు ఏమాత్రం జోరు చూపడం లేదు. దాంతో రెండో రోజు ఈ సినిమా 60 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు.

ఇక కన్నడ డబ్బింగ్ మూవీ KGF బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే అంచనాలను మించగా రెండో రోజు కూడా జోరు చూపుతూ దూసుకు పోతుంది. సినిమా జోరు చూస్తుంటే రెండో రోజు మరో సారి 80 లక్షల నుండి 1 కోటి మధ్యలో షేర్ అందుకునే చాన్స్ ఉంది.

ఇక ధనుష్ నటించిన మారి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ అద్బుతమైన గ్రోత్ ని చూపకున్నా కానీ డ్రాప్స్ చాలా తక్కువగా ఉండటం తో రెండో రోజు ఈ సినిమా రెండు రాష్ట్రాలలో సుమారు గా 30 లక్షల నుండి 40 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు.

ఇక కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జీరో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే అంచనాలను భారీ గా తప్పగా రెండో రోజు కూడా పెద్దగా జోరు చూపలేక చేతులెత్తేసింది. దాంతో రెండో రోజు సినిమా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర 15 కోట్ల నుండి 17 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్స్ రావచ్చని సమాచారం.

ఇవీ మొత్తం మీద ఈ వీకెండ్ సినిమాల రెండో రోజు కలెక్షన్స్ అంచనాలు…ఆఫ్ లైన్ లో జరిగే టికెట్ సేల్స్ ని బట్టే ఈ కలెక్షన్స్ పెరగడమో తగ్గడమో జరుగుతుంది అని చెప్పాలి. మరి ఈ సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here