Home న్యూస్ సీడెడ్ కింగ్ దిగాడు….రికార్డ్ బిజినెస్ తో రచ్చ చేశాడు!

సీడెడ్ కింగ్ దిగాడు….రికార్డ్ బిజినెస్ తో రచ్చ చేశాడు!

0

ఆల్ మోస్ట్ 6 ఏళ్ళుగా సోలో మూవీ చేయని యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) మధ్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తో కలిసి చేసిన మమ్మోత్ RRR movie తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సోలో హీరోగా తిరిగి దేవర(Devara Part 1) తో సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఆడియన్స్ ముందుకు ఈ సినిమా ఇప్పుడు…

కన్నడ గడ్డ మీద ఎన్టీఆర్ క్రేజ్…దేవరకి బిజినెస్ ఆఫర్ ఎంత వచ్చిందంటే!!
సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి…దానికి తోడూ ఇప్పుడు మంచి రిలీజ్ డేట్ కూడా సొంతం అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర మాస్ రాంపెజ్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉండగా బిజినెస్ పరంగా ఆల్ రెడీ సంచలన ఆఫర్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమాకి…

రాయలసీమలో ఆల్ మోస్ట్ బిజినెస్ ఇప్పుడు క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ నటించిన లాస్ట్ సోలో రిలీజ్ అయిన అరవింద సమేత అప్పట్లో  ఈ ఏరియాలో 14 కోట్ల లోపు బిజినెస్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా సినిమా చేస్తూ ఉండగా అది కూడా ఆచార్య లాంటి డిసాస్టర్ ఇంపాక్ట్ ఉన్నా కూడా…

350 కోట్ల సాహో…270 కోట్ల సైరా కూడా ఎన్టీఆర్ రికార్డ్ కొట్టలేదు!!
కొరటాల శివ ని నమ్మి చేస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఈ సినిమాతోనే సంచలనం సృష్టిస్తూ సీడెడ్ ఏరియాలో 23 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం….సీడెడ్ ఏరియాలో ఎన్టీఆర్ అరవింద సమేత మొదటి రోజు నమోదు చేసిన వర్త్ షేర్ రికార్డ్ రీజనల్ మూవీస్ లో ఇప్పటికీ అలానే ఉంది…..

అలాంటి ఎపిక్ రికార్డ్ ను అందుకున్న తర్వాత RRR తో మరిన్ని రికార్డులను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ కి సీడెడ్ లో క్రేజ్ మరో లెవల్ లో ఉండగా ఇప్పుడు దేవర సినిమా ఏమాత్రం అంచనాలను అందుకున్నా ఓపెనింగ్స్ నుండే ఆల్ టైం రికార్డులతో ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here