Home న్యూస్ 350 కోట్ల సాహో…270 కోట్ల సైరా కూడా ఎన్టీఆర్ రికార్డ్ కొట్టలేదు!!

350 కోట్ల సాహో…270 కోట్ల సైరా కూడా ఎన్టీఆర్ రికార్డ్ కొట్టలేదు!!

1

        టాలీవుడ్ లో అన్ని ఏరియాలు ఒకెత్తు సీడెడ్ ఏరియా మరో ఎత్తు గా చెప్పుకోవాలి, అక్కడ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో మాస్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమాలే రాజ్యం ఎలాయి. అలాగే ఓపెనింగ్స్ పరంగా అందరు హీరోలు ఇక్కడ జోరు చూపినా కానీ గత కొంత కాలంగా ఇక్కడ ఎక్కువ డామినేషన్ మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. అక్కడ ఎన్టీఆర్ ఫస్ట్ డే రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉండటం విశేషం.

రీసెంట్ టైం లో అక్కడ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు డే 1 రికార్డులను నమోదు చేయగా లాస్ట్ ఇయర్ వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా ఫస్ట్ డే ఏకంగా 5.45 కోట్ల షేర్ ని అందుకుంది, ఇది పూర్తిగా టికెట్ సేల్స్ ద్వారా వచ్చిన కలెక్షన్స్.

అక్కడ బాహుబలి 2 కి 6.35 కోట్ల షేర్ మొదటి రోజు పూర్తిగా టికెట్ సేల్స్ ద్వారా రాగా తర్వాత బిగ్గెస్ట్ రికార్డ్ ఎన్టీఆర్ అరవింద సమేత దే. ఈ రికార్డ్ ను ఈ ఇయర్ దాదాపు అందరు హీరోలు బ్రేక్ చేయాలనీ ట్రై చేసినా చేయలేక పోయారు. ఇయర్ మొదట్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన…

వినయ విదేయ రామ సినిమా ఫస్ట్ డే 7.2 కోట్ల షేర్ తో బ్రేక్ చేసింది, కానీ ఇందులో టికెట్ సేల్స్ ద్వారా వచ్చిన అమౌంట్ 2.6 కోట్లు ఉంది. 4.6 కోట్ల హైర్స్ మొదటి రోజు యాడ్ అవ్వడం తో ఏకంగా బాహుబలి 2 రికార్డ్ అవుట్ అయ్యి ఇప్పుడు న్యూ ఇండస్ట్రీ రికార్డ్ గా ఉంది ఈ సినిమా.

కానీ వర్త్ షేర్ పరంగా అరవింద సమేత రికార్డ్ అలాగే ఉండగా సమ్మర్ లో మహేష్ నటించిన మహర్షి సినిమా మొదటి రోజు 2.89 కోట్ల షేర్ ని మాత్రమె వసూల్ చేసింది, అందులో హైర్స్ లేవు. ఇక అసలు సిసలు బిగ్గెస్ట్ టాలీవుడ్ బడ్జెట్ తో రూపొందిన సాహో సినిమా 350 కోట్ల తో నిర్మాణం అవ్వగా…

Saaho Worldwide Total Collections Report!!

అత్యంత భారీ క్రేజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు హైర్స్ లేకుండా 4.7 కోట్ల వర్త్ షేర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, అంత క్రేజ్ ఉన్న సినిమా అయినా అరవింద సమేత రికార్డ్ ను బ్రేక్ చేయడం లో విఫలం అయ్యింది సాహో సినిమా.

Saaho "Hindi Version" Total Collections Report!!

ఇక తర్వాత రీసెంట్ గా 270 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సైరా నరసింహా రెడ్డి కి అల్టిమేట్ క్రేజ్ ఏర్పడగా ఖైదీ నంబర్ 150 తో నే ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన మెగాస్టార్ ఈ సారి అన్ని రికార్డుల దుమ్ము లేపెస్తాడు అనుకున్నా రాయలసీమ లో అది జరగలేదు.

సినిమా మొదటి రోజు 2.23 కోట్ల హైర్స్ తో కలిపి 5.91 కోట్ల షేర్ ని వసూల్ చేసింది, హైర్స్ తీసేస్తే వర్త్ షేర్ 3.7 కోట్ల లోపు ఉంటుంది. ఇలా రీసెంట్ టైం లో రిలీజ్ అయిన అన్ని పెద్ద సినిమా లు కూడా అరవింద సమేత వర్త్ షేర్ ని మొదటి రోజు అందుకోలేదు. ఇక

ఈ రేసులో వచ్చే ఇయర్ సంక్రాంతి కి మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో ఉండగా సమ్మర్ లో మరి కొన్ని సినిమాలు ఉన్నాయి. అవి కూడా మిస్ అయితే ఇక సెకెండ్ ఆఫ్ లో వచ్చే RRR మాత్రమె ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here