Home న్యూస్ డెవిల్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

డెవిల్ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డెవిల్(Devil – The British Secret Agent Review) ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా మంచి రిలీజ్ ను సొంతం చేసుకుని వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే బ్రిటీష్ వాళ్ళు ఇండియాని పాలిస్తున్న టైంలో ఒక జమిందారు కుటుంబంలో ఒక హత్య జరుగుతుంది, ఆ హత్య మిస్టరీని సాల్వ్ చేయడానికి బ్రిటీష్ ఏజెంట్ అయిన హీరో వస్తాడు. మరి ఆ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేసే క్రమంలో హీరో తెలుసుకున్న నిజాలు ఏంటి ఆ తర్వాత ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

మరోసారి డిఫెరెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకుని కళ్యాణ్ రామ్ మంచి మార్కులే కొట్టేశాడు, కథ పాయింట్ ఓవరాల్ గా బాగున్నా డిఫెరెంట్ షేడ్స్ ఇందులో ఉండటంతో తన వరకు బాగా నటించి మెప్పించాడు, మిగిలిన యాక్టర్స్ లో సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య ఇలా అందరూ తమ రోల్స్ లో బాగానే నటించారు…

సినిమాలో సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉన్నా సాంగ్స్ ప్లేస్ మెంట్ అంతగా సెట్ అవ్వలేదు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉండగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో మంచి స్టార్ట్ తర్వాత చాలా నెమ్మదిగా సాగుతుంది, మళ్ళీ ఇంటర్వెల్ ముందు జోరు అందుకోగా సెకెండ్ లో కొంచం పడుతూ లేస్తూ సాగినా…

ఫస్టాఫ్ కన్నా సెకెండ్ ఆఫ్ లో వచ్చే డీసెంట్ ట్విస్ట్ లు ఆకట్టుకోవడంతో ఓవరాల్ గా పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ హగా ఉన్నాయి. ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా చెప్పిన విధానం చాలా నెమ్మదిగా చెప్పడంతో…

ఒక దశ దాటాక బోర్ ఫీల్ అవుతాం, అలాగే సినిమాలో పెట్టిన లవ్ ట్రాక్ ఆసక్తిగా సాగుతున్న చాలా సీన్స్ కి అడ్డుకట్ట అయింది. ఉన్నంతలో కోర్ పాయింట్ బాగుండటం, సెకెండ్ ను డైరెక్టర్ బాగానే డీల్ చెయడం, ట్విస్ట్ లు పర్వాలేదు అనిపించేలా ఉండటం ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉండటం లాంటివి మేజర్ ప్లస్ పాయింట్స్…

ఇక లవ్ ట్రాక్ వీక్ గా ఉండటం, ఫస్టాఫ్ సాగదీసినట్లు అనిపించడం పాటల రాంగ్ ప్లేస్ మెంట్ లాంటివి డ్రా బ్యాక్స్. అయినా కానీ ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు, కొంచం డిఫెరెంట్ కథలను ఇష్టపడే వాళ్ళకి సినిమా బాగానే నచ్చే అవకాశం ఉంది. రెగ్యులర్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్…

కొంచం కొత్తదనం కోసం ఈ సినిమాకి వెళ్ళొచ్చు కానీ కొంచం ఓపిక తెచ్చుకుని ఫస్టాఫ్ వరకు ఓపిక పడితే సెకెండ్ ఆఫ్ అయ్యే వరకు ఆడియన్స్ చాలా వరకు సాటిస్ ఫై గానే థియేటర్స్ బయటికి వస్తారు… ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here