మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధమాకా, బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ తర్వాత క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత చేసిన ఖిలాడీ అలాగే రామారావ్ ఆన్ డ్యూటీ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను సొంతం చేసుకున్నా కానీ…
రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ధమాకా సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి ఇప్పుడు. సినిమా కచ్చితంగా రవితేజ కి మంచి కంబ్యాక్ మూవీ అవుతుంది అన్న నమ్మకంతో అందరూ ఉండగా సినిమా బిజినెస్ పరంగా ఇప్పుడు జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
రీసెంట్ గా సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడు పోగా ఎక్స్ లెంట్ రేటుని సొంతం చేసుకుంది ఈ సినిమా, బాక్ టు బాక్ డిసాస్టర్లు పడ్డా కానీ ఈ సినిమా కి మొత్తం మీద 12.50 కోట్ల రేంజ్ లో రేటు హిందీ డబ్బింగ్ రైట్స్ కింద సొంతం అయిందని సమాచారం.
ఇక డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కూడా సాలిడ్ రేటుకే అమ్ముడు అయ్యే అవకాశం ఉండగా బడ్జెట్ లో చాలా మొత్తం ఇక్కడ నుండే రికవరీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. యూనిట్ కూడా సినిమాను బాగా ప్రమోట్ చేస్తూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజకి ఈ సారి మంచి హిట్ గా ఈ సినిమా నిలిచే అవకాశం కనిపిస్తుంది.