Home న్యూస్ 121 కోట్ల హీరో….కొత్త సినిమా బజ్ పెద్దగా లేదేంటి!!

121 కోట్ల హీరో….కొత్త సినిమా బజ్ పెద్దగా లేదేంటి!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ ఇంపాక్ట్ తర్వాత సినిమా పై కచ్చితంగా ఉంటుందని చెప్పాలి. అలాంటిది ఊహకందని బ్లాక్ బస్టర్ తర్వాత క్రేజీ కాంబినేషన్ లో వచ్చే సినిమా కి క్రేజ్ ఇంకా ఎక్కువగా ఉండాలి కానీ ప్రస్తుతానికి రిలీజ్ కి 10 రోజులు కూడా టైం లేదు కానీ ఇప్పటి వరకు సినిమా టీసర్ కానీ ట్రైలర్ కానీ లేక పోవడం తో….

అనుకున్న రేంజ్ లో అయితే బజ్ ఇంకా పెరగలేదు అనే చెప్పాలి. ఆ సినిమానే కార్తికేయ2 తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తో పాటు టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ లో కూడా బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచినా నిఖిల్ సిద్దార్థ్ నటించిన 18 పేజెస్ గురించి…

ఈ సినిమా ఈ నెల 23 న రిలీజ్ కానుండగా సినిమాలో కొన్ని సాంగ్స్ ను రిలీజ్ చేశారు కానీ ఇప్పటి వరకు టీసర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేయక పోవడంతో కార్తికేయ2 లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఉండాల్సినంత హైప్ కానీ బజ్ కానీ పెద్దగా ఈ సినిమాకి ఇంకా రాలేదు…

దానికి తోడూ సుకుమార్ అందించిన కథతో వస్తున్న ఈ సినిమా కి హైప్ మరో లెవల్ లో రావాల్సింది కానీ ఇప్పటి వరకు అయితే అలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు, త్వరగా ట్రైలర్ లాంటివి రిలీజ్ చేసి భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పెట్టి స్టార్స్ ని ఇన్వైట్ చేస్తే ఆటోమాటిక్ గా బజ్ క్రియేట్ అవుతుంది, మరి మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి ఇక.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here