యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ దాస్ క ధమ్కి సినిమా ఆడియన్స్ ముందుకు ఉగాది కానుకగా భారీ లెవల్ లోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉందని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 8 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో తెలుగు వర్షన్ బరిలోకి దిగుతూ ఉండగా మొత్తం మీద సినిమా నైజాం ఏరియాలో 165 థియేటర్స్ లో రిలీజ్ కి….
సిద్ధం అవుతూ ఉండగా సినిమా సీడెడ్ లో 60 థియేటర్స్ లో అలాగే ఆంధ్ర లో 205 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక మిగిలిన అన్ని చోట్లా మరో 220 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు ఓవరాల్ గా…
430 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా 650 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా మొదలు అవ్వగా అన్ సీజన్ ఎఫెక్ట్ అయితే ఉందని చెప్పాలి. నైజాంలో బుకింగ్స్ కొంచం పర్వాలేదు అనిపించగా ఆంధ్రలో సినిమా ఓకే ఓకే గా ఉందని చెప్పాలి.
దాంతో ఎక్కువగా టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అవుతున్న సినిమా పండగ సెలవు అడ్వాంటేజ్ కూడా ఉండటంతో మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో కోటికి పైగా ఓపెనింగ్స్ ఖాయం అని చెప్పాలి. ఇక టాక్ బట్టి సినిమా షో షోకి గ్రోత్ ని చూపిస్తే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.