కెరీర్ లో మొట్ట మొదటి సారిగా వెబ్ సిరీస్ లో నటించాడు యువ సామ్రాట్ నాగ చైతన్య(Naga Chaitanya), తనతో రీసెంట్ గా థాంక్ యు లాంటి డిసాస్టర్ తీసినా కూడా మనం లాంటి క్లాసిక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన దూత(Dhootha Web Series Review) రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది…
8 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ థ్రిల్లర్ సిరీస్ లో కథ పాయింట్ కరప్ట్ జర్నలిస్ట్ అయిన హీరో లైఫ్ లో జరిగిన పరిణామాలు ఏంటి, కరప్ట్ జర్నలిస్ట్ నుండి హీరో ఎలా మంచి వాడిగా మారాడు, ఈ క్రమం లో ఫేస్ చేసిన పరిస్థితులు ఏంటి అనేది ఓవరాల్ గా వెబ్ సిరీస్ స్టోరీ పాయింట్…. స్టోరీ పాయింట్ సింపుల్ గానే ఉన్నప్పటికీ కూడా…
విక్రం కుమార్ కథని కొంచం తన కెరీర్ లో వచ్చిన 13B తరహా నరేషన్ తో చాలా వరకు మెప్పించాడు, కానీ హీరోని ముందు మరీ నెగటివ్ గా చూపించడం ఇబ్బంది పెట్టగా వెబ్ సిరీస్ అవ్వడంతో లెంత్ కూడా డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే కలగడం ఖాయమని చెప్పాలి…
కానీ ఓవరాల్ గా కొన్ని చోట్ల థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బాగానే మెప్పించిన దూత సిరీస్ లో నాగ చైతన్య తన రోల్ లో బాగా నటించి మెప్పించి వెబ్ సిరీస్ లో మంచి డెబ్యూని సొంతం చేసుకున్నాడు అని చెప్పొచ్చు, నెగటివ్ టు పాజిటివ్ గా మారే క్రమంలో తన పెర్ఫార్మెన్స్ బాగా మెప్పించగా కొంచం పడుతూ లేస్తూ సాగిన దూత సిరీస్….
ఓవరాల్ గా థ్రిల్లింగ్ సిరీస్ లు ఇష్టపడే ఆడియన్స్ కి పర్వాలేదు బాగుంది అనిపించేలా మెప్పించే అవకాశం ఉందని చెప్పాలి. సిరీస్ చూసిన తర్వాత చాలా మందికి వచ్చే డౌట్ థాంక్ యు మూవీ తీసింది ఈ విక్రమ్ కుమారేనా అని, ఆ సినిమా ప్లేస్ లో ఈ కథని సినిమాగా తీసినా బాగుండు అని అనుకోవడం ఖాయం. ఓవరాల్ గా ఈ వీకెండ్ లో OTT లో దూత కూడా మంచి ఆప్షన్స్ లో ఒకటి అని చెప్పొచ్చు.