Home న్యూస్ యానిమల్ మూవీ రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

యానిమల్ మూవీ రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

అర్జున్ రెడ్డి(Arjun Reddy) తో సంచలనం సృష్టించి బాలీవుడ్ లో అదే సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా దుమ్ము లేపే విజయాన్ని సొంతం చేసుకున్న సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో బాలీవుడ్ బెస్ట్ యాక్టర్స్ లో ఒకరైన రణబీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా నటించిన యానిమల్(Animal Movie) భారీ హైప్ నడుమ…

ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది… ట్రైలర్ తోనే సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ను ఏ రేంజ్ లో మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే చిన్నప్పటి నుండి తండ్రికి ఎక్కువగా ఇష్టపడే హీరో తండ్రి కోసం ఏదైనా చేయాలి అనుకుంటాడు, కానీ తండ్రి అంతగా పట్టించుకోడు…

అలాంటి కొడుకు తండ్రికి వచ్చిన ఒక ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఏం చేశాడు, ఎంత దూరం వెళ్ళాడు ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… కథ పరంగా చాలా నార్మల్ గా అనిపించే కథని అల్టిమేట్ ఎమోషన్స్, ఊహకందని మాస్ మూమెంట్స్ తో సందీప్ రెడ్డి వంగ చాలా వరకు అద్బుతంగా తెరకెక్కించాడు….

ఫస్టాఫ్ సినిమా టికెట్ డబ్బులకు వర్త్ అని చెప్పొచ్చు, రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్స్, మాస్ ఎలివేషన్స్ తన కెరీర్ బెస్ట్ అని చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ లో తన నటన అద్బుతం, ఇక అనిల్ కపూర్ తో తన సీన్స్ కూడా చాలా బాగున్నాయి, రష్మిక రోల్ మొదట్లో జస్ట్ ఓకే అనిపించినా సెకెండ్ ఆఫ్ లో తన పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇక బాబీ డియోల్ పెర్ఫార్మెన్స్ కూడా బాగా మెప్పించడం ఖాయం…

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో బాగా సెట్ అయింది, కానీ సెకెండ్ ఆఫ్ లెంత్ అండ్ లాగ్ సీన్స్ వలన బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది, సంగీతం అద్బుతంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత హైలెట్ గా నిలిచింది సినిమా కి, ఇక సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉన్నాయి. 

ఇక డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ హీరోని అద్బుతంగా ప్రజెంట్ చేసే విషయంలో, ఎమోషన్స్ ని అద్బుతంగా పండించే విషయంలో, మాస్ సీన్స్ విషయంలో తన మార్క్ ని చూపించాడు, కానీ లెంత్ మరీ ఎక్కువ అవ్వడం, సెకెండ్ ఆఫ్ సీన్స్ కొంచం లాగ్ అవ్వడంతో ఫస్టాఫ్ టెంపో సెకెండ్ ఆఫ్ క్యారీ చేయలేక పోయింది, కానీ తిరిగి క్లైమాక్స్ లో తన మార్క్ తో మళ్ళీ జోరు పెంచిన వంగ పోస్ట్ క్రెడిట్ సీన్ తో మరింత హైప్ ఇచ్చాడు… 

దాంతో అద్బుతమైన ఫస్టాఫ్ తర్వాత సెకెండ్ ఆఫ్ కొంచం డ్రాగ్ అయినా తిరిగి క్లైమాక్స్ పోర్షన్ తో సినిమా బాగానే మెప్పించింది, లెంత్ ఈజీగా సెకెండ్ ఆఫ్ లో ట్రిమ్ చేసే అవకాశం ఉంది, లెంత్ కనుక తగ్గించి ఉంటే సినిమా మరింత బాగా మెప్పించి ఉండేది, ఓవరాల్ గా సినిమా మరీ అర్జున్ రెడ్డి రేంజ్ లో కాక పోయినా కానీ చాలా వరకు అంచనాలను అయితే అందుకునే విధంగా ఉంటుంది…

ఫస్టాఫ్ చాలా వరకు ఆడియన్స్ అంచనాలను అందుకునే సినిమా సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయినా ఎండ్ అయ్యే టైంకి ఓ మంచి సినిమానే చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ బయటికి రావడం ఖాయం. కానీ ముందే చెప్పినట్లు లెంత్ కొంచం తగ్గించి, సెకెండ్ ఆఫ్ డ్రాగ్ లేకుండా ఉండి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది, ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here