లేట్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పటికీ అభిమానులకు మిస్టరీగానే మారింది, ఆల్ మోస్ట్ ఏడాది గడుస్తున్నా కానీ ఇప్పటికీ అసలు నిజాలు ఇంకా తెలియాల్సి ఉంది, తను నటించిన చివరి సినిమా దిల్ బేచారా మాత్రం అభిమానుల గుండెల్లో చిర స్థాయిగా గుర్తు ఉండటం మాత్రం ఖాయమని చెప్పాలి. తన నటన కానీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా గట్టి ముద్ర వేసింది దిల్ బేచారా మూవీ… కెరీర్ లో ఎక్కువగా హిట్స్ ని….
దక్కించుకున్న సుశాంత్ తన చివరి సినిమా తో కూడా నిర్మాతకు కోట్ల లాభం దక్కించి పెట్టాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటె మరింత బాగా ట్రిబ్యూట్ ని సొంతం చేసుకుని ఉండే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
సినిమా సుమారు 28 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందించగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం ఈ సినిమా కి 52 కోట్ల రేటు ని చెల్లించారు. ఇక సినిమా శాటిలైట్ రైట్స్ ని సుమారు 32 కోట్లకు అమ్మారని సమాచారం. ఇక మ్యూజిక్ రైట్స్ కింద సినిమా మరో 6 కోట్ల రేటు ని సొంతం చేసుకుందట.
దాంతో సినిమా మొత్తం మీద సాధించిన బిజినెస్ 90 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమాను ప్రమోషన్ కోసం 2 కోట్లు నిర్మాతల సైడ్ నుండి ఖర్చు చేశారట. అది కూడా బడ్జెట్ పరంగా కలిపినా 30 కోట్ల రేంజ్ బడ్జెట్ కి సినిమా నిర్మాతలకు ఏకంగా 60 కోట్ల ప్రాఫిట్ ని దక్కించి పెట్టింది. ఇక సినిమాను కొన్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సినిమాను ఫ్రీగా…
టెలికాస్ట్ చేయగా మెంబర్ షిప్ ఉన్న యూసర్స్ కి యాడ్స్ లేకుండా, లేని వాళ్ళకి యాడ్స్ ద్వారా సినిమాను స్ట్రీం చేయగా ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా ద్వారా వాళ్లకి ఓవరాల్ రెవెన్యూ 80 కోట్ల రేంజ్ లో దక్కిందని టాక్ ఉంది, పెట్టిన రేటు 52 కోట్లు, పబ్లిసిటీ కి 4 కోట్ల మేర ఖర్చు చేయగా అవి తీసేసినా 24 కోట్ల మేర ప్రాఫిట్ దక్కించుకుంది ఈ సినిమా.. దాంతో తన చివరి సినిమాతో కూడా నిర్మాతకి కోట్ల లాభం తెప్పించాడు సుశాంత్…