Home న్యూస్ బాలీవుడ్ పాత్ బ్రేకింగ్ న్యూస్…7 కొత్త సినిమాల షాకింగ్ డిసిషన్!

బాలీవుడ్ పాత్ బ్రేకింగ్ న్యూస్…7 కొత్త సినిమాల షాకింగ్ డిసిషన్!

0

ఈ కరోనా ఎఫెక్ట్ తో సినిమాలు థియేటర్స్ లో చూడటం మరి కొన్ని నెలల పాటు రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదు.. పరిస్థితులు కూడా ఏమాత్రం ఆశాజనకంగా కూడా లేవు. దాంతో అన్ని ఇండస్ట్రీల లో కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమా ల పరిస్థితి చాలా కష్టంగా మారిపోయింది. ఎప్పుడు రిలీజ్ అవుతాయో లేదో అన్న డౌట్ లో ఉండటం తో వాళ్లకి ఊరటగా OTT యాప్స్ నిలిచాయి.

లాక్ డౌన్ లో ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధపడగా ఇప్పుడు ఇప్పటి వరకు జరగని పాత్ బ్రేకింగ్ లెవల్ లో బాలీవుడ్ నుండి ఏకంగా 7 కొత్త సినిమాలు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవ్వడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది.

ఇందులో అక్షయ్ కుమార్ మోస్ట్ వాంటెడ్ మూవీ లక్ష్మీ బాంబ్, అజయ్ దేవగన్ సంజయ్ దత్ ల భుజ్, లేట్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ దిల్ బెచారా, అభిషేక్ బచ్చన్ బిగ్ బుల్, ముఖేష్ భట్ డైరెక్ట్ చేసిన సడక్ 2 సినిమా లతో పాటు…

మరో రెండు చిన్న సినిమాలు లూట్ కేస్ మరియు ఖుదా హఫిస్ లాంటి 7 రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాలు అన్నీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ సినిమాలన్నీంటి కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ రేటు ఇచ్చి అన్ని సినిమాల హక్కులను తీసుకుందని సమాచారం.

బాలీవుడ్ తీసుకున్న ఈ పాత్ బ్రేకింగ్ నిర్ణయం చూసి మిగిలిన ఇండస్ట్రీలు కూడా షాక్ అవుతున్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇదే మేలు అని కూడా భావిస్తున్నాయి. త్వరలోనే మిగిలిన ఇండస్ట్రీ ల నుండి కూడా షాకింగ్ నిర్ణయాలు కచ్చితంగా మనం వినడం ఖాయమని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. మరి ఆ సినిమాలు ఏవి అవుతాయో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here