Home న్యూస్ దిల్ రాజు లెక్క తప్పుతుంది…దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి!

దిల్ రాజు లెక్క తప్పుతుంది…దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి!

0

టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు(Dil Raju) కి సినిమాల మీద మంచి గ్రిప్ ఉంది అన్నది అందరికీ తెలిసిన విషయమే, కెరీర్ స్టార్టింగ్ లో వరుస పెట్టి బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకున్న దిల్ రాజు తక్కువ టైంలో టాప్ నిర్మాతలలో ఒకరిగా మారారు, సినిమాలను పెర్ఫెక్ట్ గా జడ్జ్ చేస్తారు అన్న పేరున్న దిల్ రాజు…

ఈ మధ్య ఇస్తున్న స్టేట్ మెంట్స్ కానీ సినిమాల రిజల్ట్ లు కానీ డిఫెరెంట్ గా వస్తూ ఉన్నాయి….అప్పట్లో శ్రీనివాస కల్యాణం మీద భారీ ఆశలు పెట్టుకున్నాం కానీ ఆ సినిమా అంచనాలను తప్పింది అన్న దిల్ రాజు తర్వాత లాస్ట్ ఇయర్ శాకుంతలం సినిమాతో అంచనాలను పూర్తిగా తప్పి తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ ను అందుకున్నాడు…

తన తమ్ముడి కొడుకు ఆశిష్ ను హీరోగా లాంచ్ చేస్తూ చేసిన రౌడీ బాయ్స్ కూడా అంచనాలను అందుకోలేక పోయింది. తర్వాత నాగ చైతన్యతో చేసిన థాంక్ యు కూడా బాగుంటుంది అని చెప్పినా సినిమా డిసాస్టర్ అయ్యింది…లాస్ట్ ఇయర్ వారిసు సినిమా కూడా అద్బుతం అంటూ చెప్పినా ఎదో విజయ్ స్టార్ డం వలన ఆ సినిమా హిట్ అయింది.

ఇక ఈ ఇయర్ ఫ్యామిలీ స్టార్(The Family Star) మూవీ ఓ రేంజ్ లో ఉంటుంది గీత గోవిందం(Geetha Govindam) ని మించిపోతుంది అని చెప్పినా ఆ సినిమా డిసాస్టర్ అయింది. ఇక లేటెస్ట్ గా లవ్ మీ(Love Me Movie) కథ ఆర్య తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో అనిపించిన కథ అంటూ ఓ రేంజ్ లో లేపినా కూడా..

ఇప్పుడు సినిమా చూసిన ఆడియన్స్ దిల్ రాజు జడ్జిమెంట్ ని నమ్మి థియేటర్స్ కి వెళ్లి తలలు పట్టుకుంటున్నారు… ఒకప్పుడు దిల్ రాజు బాగుంది అన్న స్టాంప్ వేసిన సినిమా అద్బుతాలు సృష్టించేది కానీ ఇప్పుడు ఎందుకో దిల్ రాజు లెక్కలు తప్పుతున్నాయి. ఎక్కువ సినిమాలు చేస్తూ ఉండటం వలన జడ్జిమెంట్ మిస్ అవుతుందో లేక కారణాలు ఏవైనా కానీ…దిల్ రాజు బ్యానర్ నుండి అందరూ ఒకప్పటిలా మంచి క్లాస్ అండ్ క్లాసిక్ హిట్స్ కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here