Home న్యూస్ పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన దిల్ రాజు…ఇండస్ట్రీ కూడా అవాక్కయింది!

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన దిల్ రాజు…ఇండస్ట్రీ కూడా అవాక్కయింది!

0

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు రీసెంట్ గా కోలివుడ్ టాప్ హీరోలు విజయ్ మరియు అజిత్ లపై చేసిన కామెంట్స్ అక్కడ ఓ రేంజ్ లో కాంట్రవర్సీని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అజిత్ కుమార్ కన్నా కూడా ప్రస్తుతం విజయ్ కి అక్కడ వచ్చే కలెక్షన్స్ ఎక్కువ కాబట్టి అజిత్ కన్నా విజయ్ ఎక్కువ అని చెబుతూ ఇద్దరికీ చెరిసగం థియేటర్స్ ఇవ్వడం తప్పని చెబుతూ…

విజయ్ సినిమాకి కొంచం ఎక్కువ థియేటర్స్ దక్కాలి అని చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక ఇక్కడ డబ్బింగ్ మూవీస్ రిలీజ్ సంక్రాంతికి ఉండొద్దు అంటూ కామెంట్స్ చేయడం తర్వాత ఎప్పుడో రిలీజ్ ను అనౌన్స్ చేసి రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పడం కూడా జరిగింది…

ఇంతా చేసి ఇప్పుడు పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇస్తూ అజిత్ కుమార్ తెగింపు సినిమాను తెలుగు రాష్ట్రాలలో నైజాం మరియు వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజే థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు… ఈ విషయం రీసెంట్ గా రివీల్ అవ్వడంతో ఇదేం ట్విస్ట్ సామి అంటూ ఇండస్ట్రీ కూడా అవాక్కయ్యింది…

సంక్రాంతికి సడెన్ రిలీజ్ ను తెలుగు రాష్ట్రాలలో అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇక్కడ సంక్రాంతి సినిమాల కన్నా ఒక రోజు ముందే రిలీజ్ అవుతుందని అంటున్నారు, ఒకరోజు కావలసినన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసి మొదటి రోజే ఎంత కుదిరితే అంత వెనక్కి తేవాలి అన్నది ప్లాన్ అని అంటున్నారు. మరి సినిమా ఇక్కడ ఎలా జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here