Home న్యూస్ డంకి మూవీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

డంకి మూవీ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

ఈ ఇయర్ ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని బాక్ టు బాక్ రెండు సార్లు 1000 కోట్ల గ్రాస్ మూవీస్ తో సంచలనం సృష్టించిన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) మరియు బాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరాణి(Raj Kumar Hirani) ల క్రేజీ కాంబినేషన్ ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ డంకి(Dunki Movie Review)…వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది.

మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ… స్టోరీ పాయింట్ విషయానికి వస్తే హీరో అలాగే హీరో ఫ్రెండ్స్ కి లండన్ కి వెళ్ళాలని అనుకుంటారు, ఇంగ్లీష్ రాకపోవడంతో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి వీళ్ళు లండన్ కి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా వెళ్ళడానికి ఎంచుకున్న విధానం ఏంటి ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

పెర్ఫార్మెన్స్ పరంగా మరోసారి షారుఖ్ ఖాన్ ఎమోషనల్ సీన్స్ తో అదరగొట్టాడు, కొన్ని సీన్స్ లో తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, తాప్సీ పర్వాలేదు అనిపించగా విక్కీ కౌశల్ ఉన్న రోల్ లో బాగా మెప్పించాడు, మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించగా….సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు బాగా మెప్పించాయి.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో పర్వాలేదు అనిపించగా సెకెండ్ ఆఫ్ లో బాగుంది అని చెప్పాలి. ఎడిటింగ్ కొన్ని చోట్ల ఇంకా చేయాల్సిన అవసరం ఉండగా, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా మెప్పించాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే రాజ్ కుమార్ హిరాణి అసలు మైగ్రేట్ అయ్యే జనాలు ఎలా అవుతున్నారు…

ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది చాలా డీటైల్ గా చెప్పాడు…. తన మార్క్ కామెడీ అండ్ ఎమోషన్స్ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయ్యింది…కానీ ఇది రాజ్ కుమార్ హిరాణి బెస్ట్ మూవీస్ లో ఒకటి అయితే కాదు, సీన్స్ వైజ్ కొన్ని చోట్ల తన మ్యాజిక్ పని చేసినా కూడా కొన్ని చోట్ల ఓపికతో సినిమా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

కానీ చాలా సీన్స్ లో రాజ్ కుమార్ హిరాణి మ్యాజిక్ వర్కౌట్ అవ్వడం, లైట్ కామెడీ తో ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా అనిపించిన డంకి కొంచం ఓపిక పట్టి చూస్తె మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్ తోనే థియేటర్స్ బయటికి వచ్చేలా చేస్తుంది. ఓవరాల్ గా రాజ్ కుమార్ హిరాణి మరోసారి ఆకట్టుకున్నాడు కానీ పూర్తి మార్కులు అయితే పడలేదు… 

మరీ 3 ఇడియట్స్, మున్నాబాయ్ సిరీస్ లు ఊహించుకుని థియేటర్స్ కి వెళితే అంతగా సాటిస్ ఫై అవ్వలేరు, కొంచం లో ఎక్స్ పెర్టేషన్స్ తో వెళితే డంకి చాలా వరకు ఆడియన్స్ ను మెప్పించే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here