Home గాసిప్స్ సరిలేరు నీకెవ్వరు ఎర్లీ బుకింగ్స్ స్టేటస్…ఇండస్ట్రీ రికార్డ్ పై మహేష్ కన్ను!!

సరిలేరు నీకెవ్వరు ఎర్లీ బుకింగ్స్ స్టేటస్…ఇండస్ట్రీ రికార్డ్ పై మహేష్ కన్ను!!

0

     టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ఈ నెల 11న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే, సినిమా పై నెలకొన్న క్రేజ్ దృశ్యా సినిమా సంచలన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు…

ఇండస్ట్రీ రికార్డుల విషయం లో దుమ్ము లేపే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. బాహుబలి అండ్ రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ ని పక్కకు పెడితే రికార్డులను తిరగరాసే ఓపెనింగ్స్ ఈ సినిమా కి సొంతం అవ్వవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా మొదలు అవ్వగా…

ఇనీషియల్ బుకింగ్స్ రిపోర్ట్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఓవర్సీస్ ప్రీమియర్ షోల టికెట్ సేల్స్ ఇప్పటికే 3 లక్షల మార్క్ ని దాటేసింది, ఇక నైజాం లో మాస్ సెంటర్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్ హైక్స్ ఉన్నా కానీ బుకింగ్స్ ఓ రేంజ్ లో కొనసాగుతున్నట్లు సమాచారం.

ఇంకా మెయిన్ సెంటర్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వాల్సి ఉంది, ఇక సీడెడ్ లో మరీ అద్బుతం కాకపోయినా పర్వాలేదు అనిపించే విధంగా బుకింగ్స్ మొదలు అయ్యాయి. ఆంద్రా రీజన్ లో మాత్రం నైజాం కి తక్కువ కానీ రేంజ్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతుంది సినిమా. ఇక కర్ణాటక తమిళనాడు మెయిన్ సెంటర్స్ బుకింగ్స్ సాలిడ్ గా సాగుతున్నాయి.

ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ స్టేటస్ తో సినిమా ఈజీ గా 26 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు. ఇక రిలీజ్ సమయానికి, మొదటి రోజు టాక్ ని బట్టి ఓవరాల్ గా 30 కోట్ల కి పైగా షేర్ ని సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. దాంతో మహేష్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోల రికార్డులు కూడా బ్రేక్ అయ్యే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here